సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR30: తాజా షెడ్యూల్‌ అప్‌డేట్‌ ఇదే!

ABN, First Publish Date - 2023-04-17T11:12:01+05:30

కొరటాల శివ (Koratala siva) దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌30’ (ntr30) ప్రకటించినప్పటి నుంచీ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొరటాల శివ (Koratala siva) దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌30’ (ntr30) ప్రకటించినప్పటి నుంచీ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘జనతా గ్యారేజ్‌’ సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే! దాంతో రెండో చిత్రం అనౌన్స్‌ చేసినప్పటి నుంచి సినిమాపై బజ్‌ విపరీతంగా పెరిగింది. షూటింగ్‌ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆతురతగా ఎదురుచూశారు. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభమైంది. ‘వస్తున్నా’ (Vastunna) అంటూ ఈ నెల ఒకటో తేదీన తారక్‌ సెట్‌లో అడుగుపెట్టారు. సినిమా సెట్స్‌ మీద కెళ్తున్న తరుణంలో చిత్రంలో ఓ డైలాగ్‌ను విడుదల చేశారు. ‘‘అప్పుడప్పుడూ ధైౖర్యానికి కూడా తెలియదు.... అవసరానికి మించి తను ఉండకూడదు అని! అప్పుడు భయానికి తెలియాలి... తను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా’’ అంటూ వదిలిన 30 సెకెన్ల టీజర్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. దాంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ స్పందనకు తగ్గట్టే సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు కొరటాల శివ.

హీరోయిన్ ఎంట్రీ ...(Janhvi Kapoor)

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో (NTR30 NExt schedule) హీరోపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రెండో షెడ్యూల్‌ గోవాలో ఉంటుందని వినిపించింది. తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమా కోసం అక్కడ రెండు సెట్లు వేశారు. సోమవారం నుంచి చిత్రీకరణ స్టార్ట్‌ చేస్తారని చిత్ర వర్గాల నుంచి సమాచారం. అయితే ఇక్కడో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) సెట్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే ఆమె హైదరాబాద్‌ చేరుకొంది. ఆదివారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలోనే ఉందని తెలిసింది. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రమిది. ఎన్టీఆర్‌30 ప్యాన్‌ ఇండియా చిత్రం కావడంతో జాన్వీకి కూడా ఇది తొలి ప్యాన్‌ ఇండియా సినిమా కానుంది.

విలన్‌గా సైఫ్‌ సైన్‌...

ఈ చిత్రంలో బలమైన విలన్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారనే వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల ఆయన ఈ చిత్రానికి సైన్‌ చేశారని, రెండో షెడ్యూల్‌ కోసం ఆయన కూడా హైదరాబాద్‌ రానున్నట్లు తెలిసింది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. కొరటాల శివ మిక్కిలినేని సుధాకర్‌, కళ్యాణ్‌ రామ్‌ బావమరిది హరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-04-17T11:15:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!