సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OO Antava Mava: చాలా వరస్ట్‌... ఇద్దరినీ ఆడేసుకుంటున్నారు!

ABN, First Publish Date - 2023-03-11T11:26:53+05:30

ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ (oo Antava maava) పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆ పాటకు అభిమానులు ఉన్నారు. బన్నీ(allu Arjun), సమంత తమదైన శైలి డాన్స్‌తో కనువిందు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ (oo Antava maava) పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆ పాటకు అభిమానులు ఉన్నారు. బన్నీ(allu Arjun), సమంత తమదైన శైలి డాన్స్‌తో కనువిందు చేశారు. హాట్‌హాట్‌ సాగే ఈ పాటలో సమంత (Samantha)స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌ను యువత మదిలో గూడుకట్టుకున్నాయి. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకూ సెలబ్రిటీలు సైతం ఈ పాటకు స్టెప్పులేసి పాట క్రేజ్‌ను మరింత పెంచేశారు. ఇప్పుడు ఇదే పాటకు అక్షయ్‌కుమార్‌, నోరాఫతేహి కాలు కదిపారు. డల్లాస్‌లో జరిగిన ఓ షోలో వీరిద్దరూ హాట్‌హాట్‌గా స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. (Nora Fatehi, Akshay Kumar trolled for Oo Antava dance) అయితే ఈ పాటకు అక్షయ్‌, నోరా డాన్స్‌లేస్తే నెటిజన్లకు నచ్చలేదు. ‘ఊ అంటావా పాటను నాశనం చేశారు కదరా’ అంటూ అక్షయ్‌కుమార్‌, నోరాఫతేహిలను సోషల్‌ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. ‘మీరు అల్లు అర్జున్‌, సమంతను మ్యాచ్‌ చేయడం కాదు కదా వారి డాన్స్‌లకు దగ్గరగా కూడా చేయలేకపోయారు. ‘వాటే వల్గర్‌ డ్యాన్స్‌..’, ‘ఇంత నీచంగా డ్యాన్స్‌ చేస్తున్నారేంటి దేవుడా’, ‘అసలు అందులో డాన్స్‌ వరకూ వెళ్లాల్సిన అతవసరం లేదు.. అక్షయ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఒక్కటి చా ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి’ అని కామెంట్లు చేస్తున్నారు. (oo Antava maava)

అయితే నోరా ఫతేహి డాన్స్‌లను అభిమానించే వారు మాత్రం ‘మా బ్యూటీ ఎంత బాగా స్టెప్పులేస్తుందో.. నిన్ను ఎవరూ బీట్‌ చేయలేరు నోరా’ అని సపోర్ట్‌ చేస్తున్నారు. పాటలో నోరా ఎక్స్‌ప్రెషన్స్‌ టూ హాట్‌గా ఉండడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘టెంపర్‌’ (ఇట్టాగే రెచ్చిపోదాం), బాహుబలి (మనోహరి), ఊపిరి, కిక్‌2, షేర్‌, లోఫర్‌ చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో కనిపించి అలరించారు.


Updated Date - 2023-03-11T11:33:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!