Hero Vijay-Chandra sekhar: తండ్రీకొడుకుల మధ్య అవి సహజం!

ABN , First Publish Date - 2023-01-28T13:18:45+05:30 IST

తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి, తన తండ్రికి మధ్య మాటల్లేవని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే! ఇదే విషయాన్ని విజయ్‌ తండ్రి స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా ఇద్దరి మధ్య సరిగ్గా మాటల్లేవనే విషయాన్ని ఆయన వెల్లడించారు.

Hero Vijay-Chandra sekhar: తండ్రీకొడుకుల మధ్య అవి సహజం!

తమిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay)కి, తన తండ్రికి మధ్య మాటల్లేవని (Father chandra sekhar) కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే! ఇదే విషయాన్ని విజయ్‌ తండ్రి స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా ఇద్దరి మధ్య సరిగ్గా మాటల్లేవనే విషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే దాని గురించి చర్చించుకోవలసిన అవసరం లేదని ఆయన అన్నారు(no issues between us) . తండ్రీకొడుకులు మధ్య అప్పుడప్పు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. (varisu)తిరిగి కలుసుకోవడమూ సహజమే! దానిని పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని విజయ్‌ తండ్రి చెప్పారు. ఇటీవల మీడియాతో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘‘విజయ్‌కు నేనంటే చాలా ఇష్టం. నాతో ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను ఎంతో ప్రేమించే సినిమా తర్వాత విజయ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తా. ఆ తర్వాతే నా భార్య. కొన్ని విషయాల్లో చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో నేనూ, విజయ్‌ ఏడాదిన్నరగా సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. అయితే మా ఇద్దరి దృష్టిలో అదేం పెద్ద విషయం కాదు. ఏ కుటుంబంలోనైనా గొడవలు పడడం, కలవడం సహజం. తండ్రీకొడుకుల బంధంలో ఇలాంటివి మామూలే. ఇటీవల మేమంతా ‘వారిసు’ సినిమా చూశాం’’ అన్నారు. రాజకీయ పార్టీ విషయంలో విజయ్‌కి, తండ్రికి మధ్య వాగ్వాదం జరిగిందని అది కోర్టు వరకూ వెళ్లిందని ఇటీవల తమిళ మీడియా కథనాలు రాసిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-01-28T14:49:03+05:30 IST