Nandamuri Kalyan Ram: అమిగోస్ విడుదల ఫిబ్రవరి 10, మార్పు లేదు

ABN , First Publish Date - 2023-02-02T17:45:31+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన 'అమిగోస్' (Amigos) సినిమా ఈనెల 10 వ తేదీన విడుదల అవుతోంది. అందులో ఎట్టి మార్పు లేదు.

Nandamuri Kalyan Ram: అమిగోస్ విడుదల ఫిబ్రవరి 10, మార్పు లేదు

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన 'అమిగోస్' (Amigos) సినిమా ఈనెల 10 వ తేదీన విడుదల అవుతోంది. అందులో ఎట్టి మార్పు లేదు. ఈమధ్య కొన్ని సినిమాలు విడుదల వాయిదా పడటం వలన, ఈ 'అమిగోస్' (Amigos) కూడా వాయిదా పడింది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా పి.ఆర్ టీము దీనిపై వివరణ ఇచ్చింది. ఫిబ్రవరి 10 (February 10) వ తేదీన సినిమా విడుదల అవుతోంది, అందులో ఎటువంటి మార్పు లేదు, అని చెప్పారు. కళ్యాణ్ రామ్ పక్కన అషీక రంగనాథ్ (Ashika Ranganath) అనే ఆమె కథానాయికగా నటిస్తోంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల అవుతోంది.

amigos.jpg

ఈ 'అమిగోస్' లో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ బజ్ ని క్రియేట్ చేసింది. సినిమాలో మూడు పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, మూడింటిని ఎలా కలిపారు, ఇందులో విలన్ ఎవరు, అసలు ఈ సినిమా ఎలా వుండబోతోంది అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కనపడుతోంది. కళ్యాణ్ రామ్ ముందు సినిమా 'బింబిసార' (Bimbisara) పెద్ద విజయం సాధించటంతో అతను మంచి ఉత్సాహంగా వున్నాడు. అలాగే వైవిధ్యమయిన కథలు కూడా చాల జాగ్రత్తగా చేస్తున్నాడు. అందుకని ఈ సినిమా మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతలుగా వున్నారు.

Updated Date - 2023-02-02T17:45:32+05:30 IST