Aditi Myakal: ఒళ్లు దాచుకోకుండా క‌ష్టప‌డుతున్నా.. అవ‌కాశాల్లేవ్‌

ABN , First Publish Date - 2023-10-28T17:04:47+05:30 IST

అదితిమ్యాకాల్ అచ్చతెలుగు అమ్మాయి.. సోషల్ మిడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం హట్ హట్ ఫోటోలు షేర్ చేస్తూ షోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. శృతి మించిన అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌తో కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేస్తున్న‌ది. ఈ అమ్మ‌డి వ్య‌వ‌హ‌రం చూసిన వారంతా ఈమె అస‌లు తెలుగ‌మ్మాయేనా లేకుంటే ఈ వీప‌రీత ప్ర‌ద‌ర్శ‌న ఏంటంటూ నోరెళ్ల‌బెడుతున్నారు.

Aditi Myakal: ఒళ్లు దాచుకోకుండా క‌ష్టప‌డుతున్నా.. అవ‌కాశాల్లేవ్‌
Aditi Myakal

అదితిమ్యాకాల్(Aditi Myakal) అచ్చతెలుగు అమ్మాయి.. తెలంగాణ కామారెడ్డికి చెందిన అమ్మడు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకుని తన ప్రదర్శనలతో మంచి పేరు సంపాదించిన ఈ అమ్మడు ఆ తర్వాత హైదరాబాద్ నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకుని ఆ రంగంలోనే కేరీర్ ప్రారంభించింది.

డిజైనర్‌గా చేస్తూనే మోడల్‌గా మారి ఆపై షార్ట్ ఫిలిమ్స్ చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అదే క్రమంలో 2017లో అర్జున్ రెడ్డి సినిమాలో చేసిన చిన్న పాత్రతో వరుస ఆఫర్లు రాబట్టింది. ఇక ఆ స్పీడులో అమీతుమీ, ఏకమ్.. వంటి ఆరేడు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆపర్లు తగ్గడంతో తన ఫ్యాషన్ డిజైనింగ్ ను కంటిన్యూ చేస్తున్నది.

Aditi.jpg

అయితే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే అదితి నిత్యం హాట్ హాట్‌ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. శృతి మించిన అందాల ప్ర‌ద‌ర్శ‌నతో కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేస్తున్న‌ది. ఈ అమ్మ‌డి వ్య‌వ‌హ‌రం చూసిన వారంతా ఈమె అస‌లు తెలుగ‌మ్మాయేనా లేకుంటే ఈ విప‌రీత ప్ర‌ద‌ర్శ‌న ఏంటంటూ నోరెళ్ల‌బెడుతున్నారు


మ‌న దగ్గ‌ర ఇంత టాలెంట్ ఉంచుకుని ముంబై భామ‌ల కోసం తిరగడం అవ‌స‌ర‌మా? మ‌న వారికి ఛాన్సులు ఇవ్వాలంటూ మ‌రికొంద‌రు స‌ల‌హాలు ఇస్తున్నారు. అయితే సినిమా ఛాన్స్‌ల కోసం, ద‌ర్శ‌కుల‌ కళ్లల్లో ప‌డేందుకు ఈ సుంద‌రి చాలాకాలంగా ఒళ్లు దాచుకోకుండా క‌ష్ట ప‌డుతున్నా అవ‌కాశాలు త‌లుపుత‌ట్ట‌డం లేదు. చూద్దాం మున్ముందైనా ఎవ‌రైనా క‌రుణిస్తారేమో.. ఛాన్స్ ఇస్తారేమో.

Updated Date - 2023-10-28T18:01:27+05:30 IST