NivethaPethuraj: అప్పట్లో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చాయి కానీ, ఇప్పుడు వస్తే మాత్రం...

ABN , First Publish Date - 2023-03-20T18:23:07+05:30 IST

నివేదా పెతురాజ్ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమాలో అతని పక్క చేస్తోంది. విశ్వక్ సేన్ ని లోకేష్ కనగరాజ్ తో పోల్చటమే కాకుండా, త్రివిక్రమ్ తరువాత అంత దర్శకుడు అని చెప్తోంది. మరి ఐటెం సాంగ్స్, గ్లామర్ గురించి ఏమి చెప్తోందో తెలుసా..

NivethaPethuraj: అప్పట్లో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చాయి కానీ, ఇప్పుడు వస్తే మాత్రం...

'దాస్ కా ధమ్కీ'(Das Ka Dhamki) సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen) పక్కన కథానాయకురాలుగా నటించిన నివేదా పెతురాజ్ (Nivetha Pethuraj), ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అంటోంది. ఇది విశ్వక్ సేన్ తో రెండో సినిమా ఆమెకి. "నాకు ‘పాగల్’ (Pagal) చేస్తున్నప్పుడే ‘ఓరి దేవుడా’ (Ori Devuda) కి కాల్ వచ్చింది. కానీ ఆ పాత్ర నాకు సరిపోదని భావించాను. తర్వాత 'దాస్ కా ధమ్కీ' స్క్రిప్ట్ విన్నాను. ఇందులో నా పాత్ర చాలా నచ్చింది. కథ కూడా చాలా యూనిక్. విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయడం మరింత స్పెషల్ గా మారింది," అని చెప్పింది నివేదా పెతురాజ్.

nivethapethuraj5.jpg

ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర చాలా కొత్తగా అనిపించింది అని చెప్తోంది నివేదా. ఎందుకంటే ఇందులో డ్యాన్సులు చేయడం కొత్తగా అనిపించింది. చాలా గ్లామరస్ రోల్. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి, అంటోంది. విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ దర్శకుడిగా విశ్వక్ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. "నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) గారి తర్వాత అంత ఎనర్జీ వున్న దర్శకుడిని విశ్వక్ సేన్ లో చూశాను", అని చెప్తోంది.

nivethapethuraj1.jpg

ఇంకా విశ్వక్ సేన్ ని తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తో పోల్చింది కూడా. అతని దగ్గర చాలా అద్భుతమైన పాయింట్స్ వున్నాయి. అయితే నటుడిగా కాకుండా వేరే హీరోలని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. "విశ్వక్ లో చాలా మాస్ వుంది. లోకేష్ కనకరాజ్ లాంటి టచ్ వుంది. బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారు లాంటి పెద్ద మాస్ హీరోలని డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్ లో వుంది. తనకి గ్యాంగ్ స్టర్ సినిమాలంటే పిచ్చి. తను చాలా మంచి గ్యాంగ్ స్టర్ డైరెక్టర్ అవుతారు. తన దగ్గర చాలా మంచి కథలు వున్నాయి," అని విశ్వక్ గురించి బాగా చెప్పింది నివేదా.

nivethapethuraj3.jpg

ఇంకా స్పెషల్ సాంగ్స్ లో ఈమధ్య అగ్ర నటీమణులు కూడా వస్తున్నారు కదా అని అడిగితే, నివేదా కి కూడా చాలా ఆఫర్స్ వచ్చాయట స్పెషల్ సాంగ్స్ చెయ్యమని. కానీ అప్పుడు చెయ్యలేడురా, ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ ఎందుకు అనీ. "కానీ ఇప్పుడు ఆఫర్ వస్తే మాత్రం స్పెషల్ సాంగ్ చేస్తా," అంటోంది ఈ మలయాళ ముద్దుగుమ్మ. స్పెషల్ సాంగ్ అంటే మరి గ్లామర్ కదా, మరి నివేదా ఇప్పుడిప్పులే కదా గ్లామర్ రోల్స్ కి అలవాటు పడుతోంది.

Updated Date - 2023-03-20T18:23:08+05:30 IST