Nithya Menen: ఇంగ్లిష్‌ పాఠం చెబుతూ...

ABN , First Publish Date - 2023-01-19T15:34:15+05:30 IST

నిత్యామీనన్‌ టీచర్‌ అవతారమెత్తారు. చిన్నారులకు పాఠాలు చెప్పారు. అయితే ఇది సినిమాలో పాత్ర కోసం కాదు. దక్షిణాదిలో కథానాయికగా బిజీగా ఉన్నారామె.

Nithya Menen: ఇంగ్లిష్‌ పాఠం చెబుతూ...

నిత్యామీనన్‌ (nithyamenen) టీచర్‌ అవతారమెత్తారు. చిన్నారులకు పాఠాలు చెప్పారు. అయితే ఇది సినిమాలో పాత్ర కోసం కాదు. దక్షిణాదిలో కథానాయికగా బిజీగా ఉన్నారామె. (nithya as teacher) ప్రస్తుతం ఆమె ఓ మలయాళ చిత్రం షూటింగ్‌ కోసం తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణాపురం గ్రామంలో సందడి చేశారు. అక్కడ షూటింగ్‌ పూర్తయిన తర్వాత లొకేషన్‌కు సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారామె. అక్కడి బాలబాలికలతో కాసేపు గడిపారు. ఆ ఆంగ్ల పాఠాలు బోధించారు. ఇంగ్లిష్‌ పాఠాలను విద్యార్థులకు అర్ధమయ్యేలా తెలుగులో వివరించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిత్యామీనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

‘‘కృష్ణాపురం గ్రామంలో ఈ చిన్నారులతో నా న్యూ ఇయర్‌ డే ఇలా గడిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు బాల్యాన్ని ఎంతో ఆనందంగా గడుపుతారని ఈ చిన్నారులను చూశాక అర్థమైంది. వాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేనూ ఎంతో ఆనందంగా ఉన్నా’’ అని నిత్యా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా అలరిస్తుంది. ఆమె పిల్లలకు తెలుగులో పాఠం చెబుతుంటే నిత్యా చక్కగా తెలుగు మాట్లాడుతోంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-01-19T15:34:17+05:30 IST