Nithin: వక్కంతం వంశీ సినిమాతో నితిన్‌ తొలి ప్రయత్నం!

ABN , First Publish Date - 2023-06-27T11:33:22+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలు పోలీస్‌ క్యారెక్టర్స్‌పై దృష్టిపెడుతున్నారు. అవకాశం వస్తే ఖాకీ దుస్తులు ధరించి లారీ పట్టుకుని పోలీస్‌ పవర్‌ చూపించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఖాకీ నేపథ్యంలో చాలా చిత్రాలే తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నితిన్‌ కూడా చేరనున్నారు.

Nithin: వక్కంతం వంశీ సినిమాతో నితిన్‌ తొలి ప్రయత్నం!

ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలు పోలీస్‌ క్యారెక్టర్స్‌పై (Police Charectors) దృష్టిపెడుతున్నారు. అవకాశం వస్తే ఖాకీ దుస్తులు ధరించి లారీ పట్టుకుని పోలీస్‌ పవర్‌ చూపించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఖాకీ నేపథ్యంలో చాలా చిత్రాలే తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నితిన్‌ (nithin) కూడా చేరనున్నారు. తొలిసారి ఆయన పోలీస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. వక్కంతం వంశీ (Vakkantham vamsi) దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. శ్రీలీల ఈ చిత్రంలో కథానాయిక. ఇందులో నితిన్‌.. పోలీస్‌గా కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. అసలీ చిత్రంలో నితిన్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాడని కూడా టాక్‌ వినిపిస్తోంది. జూనియర్‌ ఆర్టిస్ట్‌ అంటే ఈ చిత్రంలో ఆయన లాయర్‌, డాక్టర్‌, ఇంజనీర్‌.. ఇలా రకరకాల వేషాలు వేస్తుంటారు. అయితే పోలీస్‌ గెటప్‌ మాత్రం అలాంటిది కాదని సన్నిహితులు నుంచి సమాచారం. ఈ సినిమాలో పోలీస్‌ పాత్రకూ, అందులో భాగంగా వచ్చే సన్నివేశాలకూ చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసమే నితిన్‌ తన బాడీ బాడీ లాంగ్వేజ్‌నీ, గెటప్‌నీ మార్చేస్తున్నాడని సమాచారం. ‘జూనియర్‌’, ఎగస్ర్ట్టా ఆర్డినరీ మెన్‌’ టైటిళ్లు పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం నితిన్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - 2023-06-27T11:33:22+05:30 IST