Actor Nithiin: రాజకీయ ప్రచారం చెయ్యటం లేదు, అదంతా రూమర్స్: కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2023-09-30T14:23:49+05:30 IST

నటుడు నితిన్ రెండు సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా వున్నాడని, ఇప్పుడు రాజకీయాల గురించి కానీ, లేదా వేరే వాటి గురించి కానీ ఆలోచించే టైమే లేదని, కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేస్తాడు అన్న వార్త కేవలం రూమర్స్ అని కొట్టి పారేశారు.

Actor Nithiin: రాజకీయ ప్రచారం చెయ్యటం లేదు, అదంతా రూమర్స్: కుటుంబ సభ్యులు
Actor NIthiin

నటుడు నితిన్ (Nithiin) కాంగ్రెస్ పార్టీ కి ప్రచారం చేస్తున్నాడు అని కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. అలాగే అతను ఇంతకు ముందు బీజేపీ (BJP) నాయకుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (AmitShah) ని కూడా కలిసాడు. ఇప్పుడేమో బీజేపీ నుండి కాంగ్రెస్ కి వచ్చి రానున్న ఎన్నికల్లో ప్రచారం చేస్తాడు అని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలని కుటుంబ సభ్యులు ఖండించారు. ఇవన్నీ వట్టి రూమర్స్ అని నితిన్ ఎవరికీ ప్రచారం చెయ్యడు అని గట్టిగా చెప్పారు కుటుంబ సభ్యులు.

ప్రస్తుతం నితిన్ సినిమాలతో చాలా బిజీగా వున్నాడని, అదీ కాకుండా రెండు సినిమాలు ఒకేసారి చెయ్యడంతో అసలు అతనికి రాజకీయాలు గురించి ఆలోచించే టైమే కూడా లేదని చెప్పారు. నితిన్ దృష్టి ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే ఉందని, రానున్న సినిమాలు వాటి ప్రచారాలు ఎలా చెయ్యాలి, ఆ సినిమాలని ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకువెళ్లాలి, తన పాత్రలు ఎలా ఉండాలి అన్న వాటిమీదే ప్రస్తుతం దృష్టి పెట్టాడు, అంతేకానీ రాజకీయాలు గురించి ఆలోచించటం లేదని చెప్పారు.

nithiin2.jpg

నితిన్ కుటుంబానికి దగ్గరగా వున్న బంధువుకి కాంగ్రెస్ (CongressParty) టికెట్ వస్తుందని, అందుకని ఆ బంధువు కోసం నితిన్ ప్రచారం చేస్తాడని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని, మేము రాజకీయాలకి దూరంగా ఉండాలని అనుకుంటున్నామని చెప్పారు, కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా ఇటువంటి రూమర్స్ కి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటున్నామని కూడా చెప్పారు కుటుంబ సభ్యులు.

నితిన్ ఇప్పుడు దర్శకుడు వక్కంతం వంశి (VakkanthamVamsi) తో 'ఎక్స్ట్రార్డినరీ మేన్' #Extra-OrdinaryMan, అలాగే ఇంకో సినిమా వేణు అడుగుల (VenuUdugula) తో చేస్తున్నాడు.

Updated Date - 2023-09-30T14:23:49+05:30 IST