Nikhil : విదేశాల్లో ప్రత్యేక శిక్షణ

ABN , First Publish Date - 2023-09-07T17:07:53+05:30 IST

హీరో నిఖిల్‌ ‘స్వయంభు’ చిత్రం కోసం కఠిన శిక్షణ పొందుతున్నారు. ఈ చిత్రంలో యోధుడిగా కనిపించడానికి నిఖిల్‌ ఒక నెల రోజుల శిక్షణ కోసం వియత్నాం వెళ్లారు. ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్‌.

Nikhil : విదేశాల్లో ప్రత్యేక శిక్షణ

హీరో నిఖిల్‌ (nikhil) ‘స్వయంభు’ చిత్రం కోసం కఠిన శిక్షణ పొందుతున్నారు. ఈ చిత్రంలో యోధుడిగా కనిపించడానికి నిఖిల్‌ ఒక నెల రోజుల శిక్షణ కోసం వియత్నాం వెళ్లారు. ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్‌. సైగాన్‌లోని కొంతమంది బిగ్గెస్ట్‌ స్టంట్‌ మాస్టర్స్‌ టీమ్‌ యూనిట్లో భాగంగా ‘స్వయంభు’ చిత్రం యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం నిఖిల్‌కి శిక్షణ ఇస్తారు. అలాగే నిఖిల్‌ ఫిజికల్‌ మేకోవర్‌ కూడా అవుతున్నారు. దీని కోసం నిఖిల్‌ చాలా కష్టపడుతున్నారని చిత్రం బృందం చెబుతోంది.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! ఆ పోస్టర్‌లో లెజెండరీ యోధుడిగా కనిపించారు. నిఖిల్‌ నటిస్తున్న 20వ చిత్రమిది. ఇలాంటి ఛాలెంజింగ్‌ రోల్‌ ఇంతకుమునుపు నిఖిల్‌ చేయలేదు. అంతే కాదు అతని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రమిది. ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌ పతాకంపై భువన్‌, శ్రీకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్‌ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-07T17:07:53+05:30 IST