Nikhil 20: లుక్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-06-01T19:13:53+05:30 IST

హీరో నిఖిల్‌ (Nikhil20)పుట్టినరోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. భరత్‌ కృష్ణమాచారి (Bharath krishnamacharya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు (Tagore madhu) సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌పె భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు.

Nikhil 20: లుక్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే..

హీరో నిఖిల్‌ (Nikhil20)పుట్టినరోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. భరత్‌ కృష్ణమాచారి (Bharath krishnamacharya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు (Tagore madhu) సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌పె భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘స్వయంభూ’ (Swayambhu) అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘స్వయంభు అంటే స్వయంగా ఉద్భవించినదని అర్థం. నిఖిల్‌ యుద్థభూమిలో ఫెరోషియస్‌ వారియర్‌గా కనిపించారు.

పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం (ఈటె), మరొక చేతిలో ఇంకో ఆయుధంతో కనిపించారు. నిఖిల్‌ గెటప్‌, మేకోవర్‌ అద్భుతంగా వుంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీగా, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. రవి బస్రూర్‌ సంగీతం అందించగా, మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. వాసుదేవ్‌ మునెప్పగరి సంభాషణలు అందిస్తున్నారు.

Updated Date - 2023-06-01T19:13:53+05:30 IST