NiharikaKonidela: నిహారిక కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది, చూసారా..

ABN , First Publish Date - 2023-04-10T15:05:58+05:30 IST

నిహారిక కొణిదెల మళ్ళీ వార్తల్లో వుంది. మొన్నటి వరకు ఆమె విడాకులు తీసుకుంది అన్న వార్త వైరల్ అయితే, అది ఖరారు చెయ్యడానికే అన్నట్టుగా ఈరోజు ఆమె ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది. ఆమె స్వంత బ్యానర్ కూడా పెట్టింది, ఇంతకీ ఆ పేరు ఏంటంటే...

NiharikaKonidela: నిహారిక కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది, చూసారా..
NIharika Konidela

నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇక పూర్తి టైమ్ వెబ్ సిరీస్, సినిమాల మీద పెట్టేటట్టు కనపడుతోంది కదా! ఈరోజు ఆమె ఇన్స్టాగ్రామ్ (Instagram) లో ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేసినట్టు స్టోరీబోర్డు లో పెట్టింది. అంటే ఇక తాను బిజీ గా వుండదలుచుకున్నట్టు చెప్పకనే చెప్పింది. అయితే ఆమె పోస్ట్ చేసిన స్టోరీలో కొత్త ఆఫీస్ పూజ కార్యక్రమాలు చేసినట్టుగా పెట్టింది. ఆఫీస్ ఓపెన్ చెయ్యడమే కాకుండా, ఆమె స్వంత బ్యానర్ అయిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) ఆ కొత్త ఆఫీస్ లో మొదలు పెట్టింది. ఈ కొత్త ఆఫీస్ లో మొదటగా ఆమె మొట్ట మొదట మొదలెట్టిన వెబ్ సిరీస్ 'ముద్దపప్పు ఆవకాయ్' (Muddapappu Avakai) తో మళ్ళీ ఈ కొత్త ఆఫీస్ కూడా మొదలెడుతున్నట్టు చెప్పింది.

niharikakonidela-new1.jpg

పెళ్లయ్యాక ఎక్కువ యాక్టివ్ గా లేని నిహారిక ఈమధ్య మళ్ళీ చాలా యాక్టివ్ అయింది. అలాగే సాంఘీక మాధ్యమంలో ఆమె విడాకుల వార్తలు (NiharikaMarriage) కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఆమె ఒక్కర్తే పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా వుంది. అంటే దీన్ని బట్టి నిహారిక ఇప్పుడు ఒంటరి అని, విడాకులు తీసుకున్నట్టుగ్గ రూడీ చేసుకోవచ్చునేమో అని పరిశ్రమలో (NiharikaDivorce) అంటున్నారు.

niharikakonidela-new2.jpg

ఎందుకంటే వివాహం అయ్యాక సినిమాలో నటించకూడదు అని భర్త వేపు నుండి ఒత్తిడి రావటంతో సినిమాలకు చాలా దూరంగా వున్న నిహారిక ఇప్పుడు ఆఫీస్ కూడా ఓపెన్ చేసి యాక్టివ్ గా వుండదలుచుకుందీ అంటే అర్థం అదే కదా అని అంటున్నారు. ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఆమె స్నేహితులు వితిక (VithikaSheru), నిఖిల్ విజయేంద్ర (NikhilVijayendra, రవి ఇంకా చాలామంది ఆమెకి కంగ్రాట్యులేషన్స్ చెపుతున్నారు, ఆమె కూడా వాళ్ళకి మళ్ళీ రిప్లై పెట్టింది. కానీ ఆమె వైవాహిక జీవితం గురించి అధికారికంగా మాత్రం ఆమె కుటుంబం నుండి ఎటువంటి వార్త రాలేదు.

Updated Date - 2023-04-10T15:36:17+05:30 IST