NiharikaKonidela: మదర్స్ డే రోజే మొదలెట్టేసింది

ABN , First Publish Date - 2023-05-14T16:02:33+05:30 IST

అన్నట్టుగానే నిహారిక కొణిదెల దృష్టి ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్, ప్రొడక్షన్ ల మీద పెట్టింది. దానికి ముహూర్తం కూడా మదర్స్ డే రోజు ఎంచుకొని సరిగ్గా...

NiharikaKonidela: మదర్స్ డే రోజే మొదలెట్టేసింది
NIharika Konidela

నిహారిక కొణిదెల (Niharika Konidela) వార్తల్లో ఉంటూనే వుంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సల్స్' (DeadPixels) హాట్ స్టార్ (DisneyPlusHotStarTel) లో విడుదల అవుతోంది. అందులో నిహారిక తో పాటు ఇంకో నలుగురు కూడా నటించారు. అలాగే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక తన ఫోకస్ ఇంకా సినిమాలు, ప్రొడక్షన్ ఇలా ఉంటుందని చెప్పింది. సినిమాలలో నటిస్తాను అని కూడా చెప్పింది, అలాగే తన స్వంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' (Pink Elephant Pictures) లో సినిమాలు, వెబ్ సిరీస్ ఏదైనా తెస్తూ వుంటాను అని కూడా చెప్పింది.

niharika-konidela.jpg

అన్నట్టుగానే ఈరోజు అంటే 'మదర్స్ డే' #MothersDay రోజు ఒక కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. మానస శర్మ (Manasa Sharma) అనే ఆమెని దర్శకురాలిగా ఒక వెబ్ సిరీస్ లేదా వెబ్ ఫిలిం చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది సోనీ లివ్ (SonyLiv) ఛానల్ కోసం చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. దీనికి ఛాయాగ్రహణం ధనుష్ భాస్కర్, అలాగే సంగీత దర్శకుడిగా పీకె దండి, ఎడిటర్ ప్రవీణ్ పూడి (PravinPudi) పేర్లను ప్రకటించింది. త్వరలోనే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయాలను కూడా ప్రకటిస్తాం అని చెప్పింది.

niharika-konidela1.jpg

అయితే మరి ఇందులో నిహారిక నటిస్తుందో లేదో తెలీదు. ఆమె తీస్తున్న ప్రాజెక్ట్ లో ఆమె నటించకపోవచ్చు. అయితే ఇలా కొత్త టాలెంట్ ని పరిచయం చెయ్యడం కూడా మంచిదే. ఇలా ఎటువంటి హడావిడీ లేకుండా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించి అందరినీ కొంచెం ఆశ్చర్యానికి గురి నిహారిక మదర్ కూడా ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా వచ్చారు.

Updated Date - 2023-05-14T16:02:33+05:30 IST