NiharikaKonidela: మళ్ళీ యాక్టింగ్, ప్రొడక్షన్ మీదే ఫోకస్

ABN , First Publish Date - 2023-05-02T12:38:52+05:30 IST

నిహారిక కొణిదెల నటించిన 'డెడ్ పిక్సల్స్' అనే వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయింది. ఆమె మళ్ళీ నటన మీద దృష్టి సారించింది, అంటే ఆమె ఇప్పుడు అన్నిటి నుండీ ఫ్రీ, ఎంటువంటి ఒత్తిడి లేకుండా తనకి ఇష్టమైన కెమెరా ముందుకు వచ్చి నటిస్తోంది అని అర్థం అవుతోంది

NiharikaKonidela: మళ్ళీ యాక్టింగ్, ప్రొడక్షన్ మీదే ఫోకస్

నిహారిక కొణిదెల (Niharika Konidela) ఆమధ్య వార్తల్లో వున్న విషయం అందరికీ తెలిసిందే. భర్త చైతన్య జొన్నలగెడ్డ (Chaitanya Jonnalagadda) తో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నాక, ఫోటోలు కూడా ఇద్దరూ డిలీట్ చేసేసుకున్నారు. విడాకులు కూడా పుచేసుకున్నారు అన్న వార్త వైరల్ కూడా అయింది. అయితే అధికారికంగా రెండు కుటుంబాల నుండి ఎటువంటి ప్రకటన రానప్పటికీ, నిహారిక సాంఘీక మాధ్యమంలో పెట్టిన పోస్టులు చూస్తుంటూనే అర్థం అయిపోతుంది అందరికీ. నిహారిక మళ్ళీ చాలా యాక్టివ్ గా కూడా సాంఘీక మాధ్యమం లో వుంది.

niharikakonidela10.jpg

ఇదిలా ఉంటే నిహారిక మళ్ళీ నటన మీద దృష్టి పెట్టినట్టుంది. ఆమె నటించిన 'డెడ్ పిక్సల్స్' (Dead Pixels) అనే వెబ్ సిరీస్ ట్రైలర్ నిన్న విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHostarTelugu) లో మే19 న స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నిహారిక పాటు, అక్షయ్ లగుసాని (Akshay Lagusani), వైవా హర్ష (Viva Harsha), సాయి రోనక్ (Sai Ronak) లు కూడా నటించారు. ఈ ట్రైలర్ ని చూస్తే ఇది ఒక గేమింగ్ మీద కథలా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ నలుగురూ గేమ్ ఆడుతూ ఉండటం చూపించారు. ఆ గేమ్ లో ఇరుక్కుపోయి మళ్ళీ బయటకి ఎలా వస్తారు అన్నది కథాంశంలా అర్థం అవుతోంది.

niharikakonidela12.jpg

దీనితో నిహారిక మళ్ళీ నటన మీద ఫోకస్ పెట్టినట్టుగా కనపడుతోంది. పెళ్లయ్యాక నటన కి కొంచెం దూరంగా వున్న నిహారిక, ఇప్పుడు మళ్ళీ నటించటం మొదలు పెట్టింది. అలాగే ప్రొడక్షన్ హౌస్ కి కొత్త ఆఫీస్ కూడా కొన్ని రోజుల క్రితం ఓపెన్ చేసింది. తాను చెయ్యబోయే పని గురించి, తన నటించిన వెబ్ సిరీస్ ఇలా ఎక్కువ వర్క్ గురించే మాట్లాడుతోంది సాంఘీక మాధ్యమంలో. అంటే నిహారిక తనకిష్టమైన నటనకి మళ్ళీ దగ్గరయ్యానన్న సంతోషంలో ఉన్నట్టుంది అని అందరికీ తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, ఆమె ఎటువంటి అధికారిక ప్రకటన చేయనవసరం లేదు, దాని భావం అదే తిరుమలేశా ! అన్నట్టుగా అర్థం అయిపొయింది.

Updated Date - 2023-05-02T12:38:52+05:30 IST