సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Niharika Konidela: అన్నకు మేమంటే ఎంతో ప్రేమ.. అందుకే అలా..

ABN, First Publish Date - 2023-06-23T12:41:57+05:30

రామ్‌ చరణ్‌ - ఉపాసన దంపతులకు పండండి ఆడ బిడ్డ పుట్టడంతో మెగా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ మేరకు మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కూడా రామ్‌చరణ్‌ బిడ్డ గురించి ఆనందం వ్యక్తం చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్‌ చరణ్‌(Ram charan)- ఉపాసన (Upasana)దంపతులకు పండండి ఆడ బిడ్డ పుట్టడంతో మెగా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ మేరకు మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) కూడా రామ్‌చరణ్‌ బిడ్డ గురించి ఆనందం వ్యక్తం చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.

‘‘చరణ్‌ అన్న తండ్రి కాబోతున్నాడని తెలిసినప్పటి నుంచి మా కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఆడ బిడ్డ రాకతో రామ్‌ చరణ్‌ ఫ్యామిలీ పరిపూర్ణమైంది. మా కుటుంబంలో కజిన్స్‌ అందరినీ చరణ్‌ అన్న ఎంతో జాగ్రత్తగా, ప్రేమతో చూసుకుంటాడు. మా అందరికీ తనంటే ప్రాణం. అందుకే తనని మేము బాపూజీ (Bapuji)అని పిలుస్తాం. మా వదిన ఉపాసన వదిన ఓ శక్తిమంతమైన మహిళ. వీళ్లిద్దరి సంరక్షణలో పాప కచ్చితంగా గొప్పగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది’’ అని అన్నారు.

పాప పుట్టిన కాసేపటికే చిరంజీవి ఎంతో ఆనందంతో ట్వీట్‌ చేశారు. తన రాక కోట్ల మందిలో ఆనందం నింపిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ చిన్నారి ఫొటోలు చరణ్‌ పాప అని నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అవన్నీ ఫేక్‌ అని మెగా ఫ్యామిలీ తెలిసింది. ఇప్పుడు అభిమానులంతా రామ్‌చరణ్‌ - ఉపాసనల పాప ఫొటో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఉపాసన మీడియా ముందుకు రానున్నారు. ఆ సమయంలో తమ బిడ్డను చూపించే అవకాశం ఉందని అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. అలాగే ఈరోజు (శుక్రవారం) ఉపాసన డిశ్చార్జ్‌ కానున్నారు.

Updated Date - 2023-06-23T12:41:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!