Pushpa 2: రాత్రిపూట షూటింగ్ చేస్తున్న అల్లు అర్జున్, కథని మలుపు తిప్పేవి ఇవే...

ABN , First Publish Date - 2023-06-30T15:35:08+05:30 IST

అల్లు అర్జున్ కి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా 'పుష్ప'. ఇప్పుడు దీనికి సీక్వెల్ 'పుష్ప 2' కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా కోసం రాత్రి వేళల్లో చిలుకూరు దగ్గర వున్న ఒక ప్రైవేట్ రిసార్ట్స్ లో షూటింగ్ చేస్తున్నాడు అని తెలిసింది

Pushpa 2: రాత్రిపూట షూటింగ్ చేస్తున్న అల్లు అర్జున్, కథని మలుపు తిప్పేవి ఇవే...
Pushpa 2

దర్శకుడు సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (AlluArjun) కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' #Pushpa2 సినిమా షూటింగ్ శరవేగంగా, సైలెంట్ గా సాగిపోతోంది. గత అయిదు రోజులనుండి ఈ సినిమా షూటింగ్ రాత్రి వేళల్లో చిలుకూరు #ChilkurBalajiTemple దగ్గర వున్న ఒక ప్రైవేట్ రిసార్ట్స్ లో జరుగుతోంది అని తాజా సమాచారం ప్రకారం తెలిసింది. ఈ షూటింగ్ లో అల్లు అర్జున్ తో పాటు, బ్రహ్మాజీ (Brahmaji), అనసూయ (Anasuya), సునీల్ (Sunil), రావు రమేష్ (RaoRamesh), ఫహద్ ఫాజిల్ (FahadhFaasil) ఇంకా మరికొందరు ఆర్టిస్టులు పాల్గొన్నారని తెలిసింది.

దర్శకుడు సుకుమార్ చాలా కీలక సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. 'పుష్ప 2' కథని మలుపు తిప్పే సన్నివేశాలు ఇవే అని, అందుకే గత అయిదు రోజులుగా రాత్రి పూట ఈ రిసార్ట్స్ లో షూటింగ్ చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. సాయంత్రం సుమారు అయిదుగంటలకు షూటింగ్ స్టార్ట్ అయి, మళ్ళీ తెల్లవారుజాము 4.00 గంటల వరకు జరుగుతోందని తెలిసింది.

allu-sukumar.jpg

మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్టులో చివర్లో వస్తాడు అతను, ఈ రెండో పార్టులో అతని పాత్ర పెద్దగానే ఉంటుందని తెలిసిందే. అలాగే ఇంకో నటుడు రావు రమేష్ పాత్ర కూడా ఈ రెండో పార్టులో చాలా పెద్దగా ఉంటుంది అని కూడా తెలుస్తోంది. అనసూయ, సునీల్ మొదటి పోర్టులో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఉంటుందని, అలాగే బ్రహ్మాజీ కూడా ఫహాద్ ఫాజిల్ తో పాటు కనపడుతూ ఉంటాడని తెలిసింది. ఇక్కడ షూటింగ్ అయ్యాక, మళ్ళీ మారేడుమిల్లి షూటింగ్ షిఫ్ట్ అవొచ్చు అని తెలిసింది. రష్మిక మందన్న (RashmikaMandanna) ఇందులో కథానాయకురాలు.

Updated Date - 2023-06-30T15:35:08+05:30 IST