Salaar: ఖాన్సర్‌ యుద్ధం: కుర్చీని తగలబెట్టేందుకు శౌర్యాంగులు.. వ‌ర‌దా కోసం దేవా! ఎవ‌రు గెలిచారు

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:15 PM

డిసెంబ‌ర్‌ 22న విడుద‌లై దేశ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న స‌లార్ సినిమా నుంచి తాజాగా మేక‌ర్స్ ఓ చిన్న డైలాగ్ ప్రోమో విడుద‌ల చేశారు. 34 సెక‌న్ల నిడివితో ఉన్న ఈ వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ది.

Salaar: ఖాన్సర్‌ యుద్ధం: కుర్చీని తగలబెట్టేందుకు శౌర్యాంగులు.. వ‌ర‌దా కోసం దేవా! ఎవ‌రు గెలిచారు
salaar

డిసెంబ‌ర్‌22 న విడుద‌లై దేశ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న స‌లార్ (Salaar) సినిమా నుంచి తాజాగా మేక‌ర్స్ ఓ చిన్న డైలాగ్ ప్రోమో విడుద‌ల చేశారు. 34 సెక‌న్ల నిడివితో ఉన్న ఈ వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ది. ఇప్ప‌టికే ఈ చిత్రం రిలీజైన అన్ని సెంట‌ర్ల‌లో హౌజ్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతుండ‌గా ఈ వీకెండ్‌ను , వ‌రుసబెట్టి వ‌స్తున్న‌సెల‌వు రోజుల‌ను కూడా స‌ద్వినియోగం చేసుకునేందుకు గాను మేక‌ర్స్ రోజుకు ఒక‌టి రెండు చొప్పున‌ సినిమా నుంచి కొత్త‌ ప్రోమోల‌ను విడుద‌ల చేస్తూ అప్ప‌టికీ సినిమా చూసిన వారికి, ఇంకా చూడ‌ని వారిలో క్యూరియాసిటీ పెంచేలా ప్రోమోల‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న‌ది.

కేజీఎఫ్‌ సినిమా ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్‌ నీల్ (Prashanth Neel) తెర‌కెక్కించిన ఈ స‌లార్ (Salaar) సినిమాతో ఎంతోకాలంగా ప్ర‌భాస్ (Rebel Star Prabhas) ఫ్యాన్స్ అశిస్తున్న బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందించ‌డ‌మే కాక ఇది క‌దా సినిమా అనే రీతిలో ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్రభాస్‌ కటౌట్‌కి.. ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కి థియేట‌ర్ల‌లో ప్రేక్షకులకు పూనకాలే వ‌చ్చాయంటే చిత్రం అభిమానుల‌ను ఏమేర అల‌రించిందో అర్థం చేసుకోవ‌చ్చు.ఇక సినిమా ఎండింగ్‌లో స‌లార్ పార్ట్ 2 (శౌర్యాంగ పర్వం) ఉంటుందంటూ ప్ర‌క‌టించ‌డంతో ఇప్ప‌టినుంచే ఫ్యాన్స్ అంచ‌నాలు మొద‌లు పెట్టారు. సినిమా ఎప్పుడెడొస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ క్ర‌మంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ విడుద‌ల చేసిన డైలాగ్ ప్రోమో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా చేస్తుంది సలార్‌-2 (Salaar) శౌర్యాంగపర్వంఎలా ఉండొచ్చనే అంశాలపై ముఖ్య అంశాల‌ను వివ‌రిస్తూ ఒక వీడియోను కాసేపటి క్రితం విడుదల చేసింది. అందులో. ‘ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సర్‌ యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఇంకో పక్కన‌ వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ దేవా.. అదే కుర్చీని వరదకు ఇస్తానని మాటిచ్చాడు. కానీ.. దాని మీద కూర్చునే హక్కు దేవాది.’ అంటూ శృతిహ‌స‌న్ వాయిస్ ఓవ‌ర్‌లో వ‌చ్చిన‌ డైలాగ్‌ ప్రోమో గూస్‌బంప్స్ తెచ్చేలా ఉంది. అయితే ఆ యుద్దంలో గెలిచాడా లేదా, దేవానే వ‌ర‌దాకు కుర్చీ అప్ప‌గించాడా, మెకానిక్‌గా ఎందుకు మారాడ‌నే అనుమానాలు తీరాలంటే పార్ట్‌2 కోసం వెయిట్ చేసేలా ప్రోమో క‌ట్ చేశారు.

పాన్ ఇండియా స్ళాయిలో విడుద‌లైన ‘సలార్ పార్ట్ 1, సీజ్ పైర్’(Salaar) బాక్సాఫీస్ వద్ద ద‌మ్ము రేగొడుతున్న‌ది. సినిమా ఎనిమిది రోజుల్లోనే రూ.600 కోట్ల (Rs. 600 Cr) వసూళ్ల మార్క్ టచ్ చేసింది. దీంతో ‘సలార్’తో మ‌రోసారి ప్రభాస్ (Rebel Star Prabhas) స్టార్ డమ్ మరోసారి రుజువైంది. బాహుబలి 1, బాహుబలి 2 సినిమా తర్వాత సలార్‌తో ప్రభాస్ మరోసారి రూ.600 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరారు. ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే 1 కలెక్షన్స్ సాధించిన సలార్ (Salaar) .. నేషనల్ చైన్స్‌లో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ (Shah Rukh Khan Dunki) సినిమా గట్టి పోటీ ఇచ్చినా.. దానిని అధిగ‌మించి క‌లెక్ష‌న్లు సాధిస్తున్న‌ది.

Updated Date - Dec 31 , 2023 | 03:24 PM