Tollywood: తెలుగు తెరపై న్యూ కాంబినేషన్స్.. కనుల విందు పక్కా!

ABN , First Publish Date - 2023-11-10T16:56:07+05:30 IST

త్వరలో తెలుగు తెరపై ఆసక్తికరమైన కాంబినేషన్లు దర్శనమివ్వబోతున్నాయి. ఇప్ప‌టికే అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్ ఎన్టీఆర్‌తో దేవ‌ర సినిమా చేస్తుండ‌గా.. కొత్త‌గా మ‌రికొన్ని కాంబినేష‌న్లు సెట్ అయిన‌ట్లు నెట్టింట వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. అవే నిజ‌మైతే మాత్రం సినీ అభిమానుల‌కు క‌నుల‌విందు పక్కా అని చెప్పుకోవచ్చు. ఆ కాంబినేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

Tollywood: తెలుగు తెరపై న్యూ కాంబినేషన్స్.. కనుల విందు పక్కా!
SARA, RUKMINI

త్వరలో తెలుగు తెరపై ఆసక్తికరమైన కాంబినేషన్లు దర్శనమివ్వబోతున్నాయి. ఇప్ప‌టికే అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్ ఎన్టీఆర్‌తో దేవ‌ర సినిమా చేస్తుండ‌గా.. కొత్త‌గా మ‌రికొన్ని కాంబినేష‌న్లు సెట్ అయిన‌ట్లు నెట్టింట వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. అవే నిజ‌మైతే మాత్రం సినీ అభిమానుల‌కు క‌నుల‌విందు పక్కా అని చెప్పుకోవచ్చు. ఆ కాంబినేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

జాతీయ ఉత్త‌మ న‌టుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌స్తుతం ‘పుష్ప 2’(Pushpa2) షూటింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత బన్నీ త‌న 22వ చిత్రాన్ని త్రివిక్ర‌మ్‌తో, 23వ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. అయితే త్రివిక్ర‌మ్ (Trivikram Srinivas)తో చేయ‌బోతున్న సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా.. జాతీయ ఉత్త‌మ న‌టి కృతి స‌న‌న్ (Kriti Sanon) చేయ‌నున్న‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

kriti-sanon.jpg

ఇటీవ‌లే ‘స్కంద’(skanda) సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన రామ్ పోతినేని (Ram Pothineni) ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాధ్‌తో ‘డ‌బుల్ ఇస్మార్ట్’(Double ISMART) చేస్తుండ‌గా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీఖాన్ తెలుగులో అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అమ్మ‌డు తండ్రి సైఫ్ అలీఖాన్ ‘దేవ‌ర’ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతుండ‌గా.. ఇప్పుడు బిడ్డ కూడా తెలుగు బాట ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

saraalikhandating.jpg

అదేవిధంగా ఈ సినిమా అనంత‌రం పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణంలో రామ్ ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో ఇటీవ‌ల ‘స‌ప్త‌సాగ‌రాలు దాటి’ (Sapata Sagaralu Dhaati) అనే క‌న్న‌డ డ‌బ్బింగ్‌ సినిమాతో తెలుగు గుర్తింపు తెచ్చుకున్న‌ కర్ణాట‌క లేటెస్ట్ క్ర‌ష్ రుక్మిణి వ‌సంత్ (RukminiVasanth) హీరోయిన్‌గా సెల‌క్ట్ అయిన‌ట్టు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


Rukmini-Vasanth.jpg

ఇక ఇటీవ‌లే ‘ఖుషి’తో హిట్ కొట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda).. ప్రస్తుతం ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న 11వ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా.. త‌న 12వ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్‌లో ‘జెర్సీ’ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి(GowtamTinnanuri) దర్శకత్వంలో చేస్తుండ‌గా అనిరుధ్ (Anirudh) సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు.

అయితే ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా చియాన్ విక్ర‌మ్ క‌ల్ట్ సినిమా ‘నాన్న‌’లో బాల న‌టిగా చేసిన సారా అర్జున్ (Sara Arjun) న‌టిస్తున్న‌ద‌ని.. ఇప్ప‌టికే ఆమె పార్ట్ షూటింగ్ కూడా పూర్తయినట్లు న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఇటీవ‌ల మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్‌2లో చిన్న నాటి ఐశ్వ‌ర్య‌రాయ్‌గా న‌టించి మెప్పించింది.

sara-arjun.jpg

ఇవ‌న్నీ ఇలాఉండ‌గా ఈ కాంబినేషన్స్‌పై ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జరుగుతున్న‌ప్ప‌టికీ.. స‌ద‌రు సినిమా యూనిట్లు అధికారికంగా అయితే ఈ భామల గురించి ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అలా అని ఆ వార్త‌ల‌ను వారు ఖండించనూ లేదు. కొంత‌కాలం ఎదురు చూస్తేనే గానీ ఈ వార్త‌ల‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2023-11-10T17:11:29+05:30 IST