Salaar: ఈ టైమ్‌కి.. ఈ టైమ్‌కి సంబంధం ఏంటి?

ABN , First Publish Date - 2023-07-04T15:38:00+05:30 IST

కేజీఎఫ్‌2’ సిరీస్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌' తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 6న ఉదయం 5.12 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం , టీజర్‌ విడుదల చేసే సమయం గురించి నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది.

Salaar: ఈ టైమ్‌కి.. ఈ టైమ్‌కి సంబంధం ఏంటి?

'కేజీఎఫ్‌2’ (KGF2) సిరీస్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ నీల్‌(Prasanth neel). ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌'(Salaar) తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 6న ఉదయం 5.12 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం టీజర్‌ విడుదల చేసే సమయం గురించి నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ను ‘కేజీఎఫ్‌2’తో ఏదో లింక్‌ చేశారని కామెంట్‌ చేస్తున్నారు. (Time Comparision)

‘సలార్‌ టీజర్‌ను ఈ నెల 6 తెల్లవారుజామున 5.12కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సమయంపై నెట్టింట చర్చ మొదలైంది. ‘కేజీఎఫ్‌2’ క్లైమాక్స్‌లో యశ్‌పై సముద్రంలో దాడి జరిగిన సమయం కూడా ఇదే కావడం విశేషం. ఆ సీన్‌లో యశ్‌ ప్రయాణించే ఓడలో సమయాన్ని 5.12 గా చూపించారు. ఇప్పుడు అదే సమయంలో ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ టీజర్‌ రిలీజ్‌ చేయడం గమనార్హం. దీంతో సలార్‌ను ‘కేజీఎఫ్‌’తో పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. కేజిఎఫ్‌లో యశ్‌ లుక్‌ రఫ్‌గా ఉంటుంది. తాజాగా విడుదల చేసిన ప్రభాస్‌ లుక్‌ కూడా అలాగే ఉంది. కేజీయఫ్‌ గోల్డ్‌ మైనింగ్‌ నేపథ్యంలో రూపొందితే, సలార్‌ కోల్‌ మైనింగ్‌ కథగా తెరకెక్కుతోంది. దీనితో ఈ రెండు చిత్రాలకు ఏదో లింక్‌ ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.

ప్రభాస్‌ సరసన శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఐదు భాషల్లో సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-07-04T16:31:04+05:30 IST