Pavitra - Naresh: ట్రెండింగ్‌కు మించి కామెంట్లు!

ABN , First Publish Date - 2023-04-22T14:16:36+05:30 IST

పవిత్రానరేశ్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పేరిది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. యూట్యూబ్‌.. ఇలా అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల్లోనూ విపరీతంగా వైరల్‌ అవుతున్న పేరు.

Pavitra - Naresh: ట్రెండింగ్‌కు మించి కామెంట్లు!

పవిత్రానరేశ్‌..(pavitra naresh)

ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పేరిది.

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. యూట్యూబ్‌..

ఇలా అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల్లోనూ విపరీతంగా వైరల్‌ అవుతున్న పేరు.

సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌(Vk Naresh), కన్నడ నటి పవిత్రా లోకేశ్‌ (Pavitra lokesh) కలిసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ‘మా’ ఎన్నికల సమయంలో పవిత్రా, నరేశ్‌ వెన్నంటే ఉంది. అయితే కొంతకాలం తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనీ, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కొందరైతే పెళ్లి కూడా చేసేసుకున్నారని మాట్లాడుకున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఇద్దరూ లిప్‌లాక్‌ చేసుకున్నట్లు, మూడు ముళ్ల బంధంతో ఒకటైనట్లు, ఏడు అడుగులు వేసినట్లు ఓ వీడియో విడుదల చేసి వీక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారా? అన్నంతగా బిల్డప్‌ క్రియేట్‌ చేశారు. అయితే అవన్నీ తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘మళ్లీ పెళ్లి’ (Malli pelli) చిత్రానికి సంబంధించిన విజువల్స్‌ అని తేలింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ చూశాక వీరిద్దరి మధ్య బంధం పరాకాష్టకు చేరిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. గత రెండుమూడేళ్లగా పవిత్రా -నరేశ్‌ల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఎమ్మెస్‌ రాజు ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రేమాయణానికి నరేశ్‌ నిర్మాత. తాజాగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ టీజర్‌లో చివర్లో కన్నుకొట్టి సైగ చేసే సీన్‌ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనిపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాను రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్ట్‌ చేసుంటే బావుండేది అని కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్‌ అయితే హద్దు దాటి 'మళ్ళీ.. శోభనం’ .. విడుదల ఎప్పుడూ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ టీజర్‌ విడదలయ్యాక ఎంత ట్రెండ్‌ అయిందో.. దానిపై వస్తున్న కామెంట్లు అంతకుమించి వైరల్‌ అవుతున్నారు.

ఈ చిత్రం టీజర్‌ను వీక్షించిన అనంతరం కొందరు నెటిజన్స్‌ చేసిన కొన్ని కామెంట్స్‌ ఇవి... (Malli pelli teaser Viral)

1. ‘ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో విడుదలై 3000 కోట్ల వసూళ్లు సాధించాలని కోరుకుంటూ- జేమ్స్‌ కేమరూన్‌ ఫ్యాన్స్‌!

2. నేను ఈ కామెంట్స్‌ చదివి నవ్వుకోవడానికే సోషల్‌ మీడియాలోకి వచ్చాను.

3. ‘మన పరువును మనకి మనమే ఎలా తీసుకోవాలి అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు.

4. బతుకు జట్కాబండి, ఇది కథ కాదు.. జీవితం అన్న టైటిళ్లు కరెక్టుగా సరిపోయే సినిమా ఇది.

‘ఇలాంటి భాగోతాలతో సినిమాలు మరిన్ని రావాలి.

Updated Date - 2023-04-22T14:24:32+05:30 IST