Dasara: నాని సినిమా ఓ.టి.టి. లో ఎక్కడంటే...

ABN , First Publish Date - 2023-03-31T11:04:45+05:30 IST

నాని సినిమా 'దసరా' ఏ ఓ.టి.టి. లో ఎప్పుడు, ఎక్కడ అని అందరికి చాలా ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా ఇంతకీ ఓ.టి.టి హక్కులు ఎంతకి తీసుకున్నారంటే....

Dasara: నాని సినిమా ఓ.టి.టి. లో ఎక్కడంటే...

నాని (Nani) శ్రీరామనవమి పండగ నాడు 'దసరా' (Dasara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నేపధ్యం తెలంగాణాలోని గోదావరిఖని దగ్గర వున్న ఓ గ్రామంలో జరిగింది. ఇందులో నాని తెలంగాణ యాస మాట్లాడతారు. దీనికి శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడు, ఇది అతనికి మొదటి సినిమా. కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయిక. సినిమా కథ స్నేహం, ప్రేమ, పగ, ప్రతీకారం మధ్య వున్న ఒక కమర్షియల్ సినిమా ఇది. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోయేట్టు వున్నాయి. నాని ఈ సినిమా కోసం చాలా విస్తృత ప్రచారం చేసాడు.

అయితే ఈ సినిమా ఓ.టి.టి. లో ఎప్పుడు, ఎందులో వస్తుంది అని చాలామంది కి ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓ.టి.టి. లో వస్తుంది. అయితే సినిమా థియేటర్ లో విడుదల అయిన 8 వారాలకు గానీ ఓ.టి.టి. లో వెయ్యకూడదు అని ఈమధ్య నిర్మాతలు అందరూ కలిపి ఒక నిబంధన పెట్టుకున్నారు. కానీ ఆలా ఎవరూ పాటించటం లేదు కూడా. ఎందుకంటే థియేటర్ లో సినిమా సరిగ్గా ఆడకపోతే ఆ సినిమాని వెంటనే ఓ.టి.టి. లో ప్రసారం చేసేస్తున్నారు.

dasarafirstdayfirstshow1.jpg

ఇదిలా ఉంటే, నాని సినిమా ధియేటరికల్ హక్కులు సుమారు రూ.50 కోట్ల వరకు అమ్ముడు పోయాయని అంటున్నారు. అలాగే ఈ లెక్కన ణొన్ ధియేటరికల్ హక్కులు కూడా బాగానే పోయాయని కూడా అంటున్నారు. ఈ సినిమా నిర్మాతలకి దానివల్లనే సుమారు రూ.40 కోట్లు వచ్చాయని కూడా అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు నెట్ ఫ్లిక్స్ లో వస్తుందో మరి చూడాలి. ఈ సినిమాలో హింస, తాగుడు ఎక్కువగా ఉందని కొంత విమర్శిస్తున్నారు.

Updated Date - 2023-03-31T11:04:47+05:30 IST