Lady Director: టాలీవుడ్‌కి మరో దర్శకురాలు!

ABN , First Publish Date - 2023-05-07T21:48:44+05:30 IST

తాజాగా మరో మహిళా మెగా ఫోన్‌ పట్టబోతున్నారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీరజ కోన ఇప్పుడు దర్శకురాలిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు.

Lady Director: టాలీవుడ్‌కి మరో దర్శకురాలు!

టాలీవుడ్‌లో మహిళా దర్శకుల సంఖ్య చాలా తక్కువ. ఒకప్పుడు చూస్తే భానుమతి, సావిత్రి, విజయ నిర్మల పేర్లు వినిపించేవి. నెక్స్ట్‌ జనరేషన్‌లో సుచిత్రా చంద్రబోస్‌, నందినీరెడ్డి, సుధా కొంగర, గౌరీ రోనంకి తదితరులు లేడీ డైరెక్టర్స్‌గా నిరూపించుకున్నారు. తాజాగా మరో మహిళా మెగా ఫోన్‌ పట్టబోతున్నారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీరజ కోన (Neeraja kona) ఇప్పుడు దర్శకురాలిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రంలో నితిన్‌కి స్టైలిస్ట్‌గా పనిచేసిన ఆమె నితిన్‌ను స్టైలిష్‌గా చూపించింది. దాంతో నీరజ పేరు తెరపైకి వచ్చింది. అలాగే సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్‌గా కూడా ఆమె పేరు తెచ్చుకుంది. శ్రుతీహాసన్‌, లావణ్యా త్రిపాఠీ, తదితరులుకు స్టైలిస్ట్‌గా పని చేశారు. ఆమెలో రచయిత కూడా ఉన్నారు. నీరజాకు పాటలు రాసిన అనుభవమూ ఉంది. ఇప్పుడామె మెగా ఫోన్‌ పట్టబోతున్నారు. సిద్థు జొన్నల గడ్డ కథానాయకుడిగా నీరజ కోన దర్శకత్వంలో ఓ సినిమా ఓకే అయ్యింది. పీపుల్‌ మీడియా ప్యాక్టరీ ఈ సినిమాని నిర్మించనుంది. సిద్థు ప్రస్తుతం టిల్లు స్వ్కేర్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత నీరజ సినిమా ి సెట్స్‌ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. (neeraja kona to direct Siddhu jonnalagadda)

Updated Date - 2023-05-07T21:48:44+05:30 IST