Nbk: బోయపాటి అనుకున్నది ఒకటి.. బాలయ్య చెప్పింది మరొకటి

ABN , First Publish Date - 2023-05-25T10:35:40+05:30 IST

నందమూరి బాలకృష్ణ (Bala Krishna) - బోయపాటి శ్రీను(boyapati srinu).. ఇద్దరిది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. వీరి కలయికలో సింహా, లెజెండ్‌(Legend Sequel), అఖండ (Akhanda) వంటి హిట్స్‌ చిత్రాలొచ్చాయి.

Nbk: బోయపాటి అనుకున్నది ఒకటి.. బాలయ్య చెప్పింది మరొకటి

నందమూరి బాలకృష్ణ (Bala Krishna) - బోయపాటి శ్రీను(boyapati srinu).. ఇద్దరిది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. వీరి కలయికలో సింహా, లెజెండ్‌(Legend Sequel), అఖండ (Akhanda) వంటి హిట్స్‌ చిత్రాలొచ్చాయి. ఒకదాన్ని మించి ఒకటి హిట్‌ అయ్యాయి. ఇప్పుడీ క్రేజీ కాంబినేషన్‌ డబుల్‌ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టబోతోంది. బాలయ్య తదుపరి చిత్రం బోయపాటితోనే అని చాలాకాలంగా టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తారట. ఈ చిత్రాన్ని జులై మొదటి వారంలో అధికారికంగా ప్రకటిస్తారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘అఖండ’కు సీక్వెల్‌గా ఈ చిత్రం ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అఖండ క్లైమాక్స్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉండబోతుంది అని చెప్పకనే చెప్పారు బోయపాటి. దాంతో వీరిద్దరి తదుపరి చిత్రం ‘అఖండ-2’ అనే అనుకున్నారంతా. అయితే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చే చిత్రం అది కాదట. ‘లెజెండ్‌’కి సీక్వెల్‌ చేస్తారట. బాలయ్య కూడా ‘లెజెండ్‌’ సీక్వెల్‌ వైపే మొగ్గు చూపారట.

‘లెజెండ్‌’లో రాజకీయ అంశాలు, ఎలివేషన్స్‌ ఎక్కువ. పొలిటికల్‌ సెటైర్లూ ఎక్కువే. అందులో ఎమ్మెల్యేని పిలిచి దమ్కీ ఇచ్చే సీన్‌ ఎంతగా అలరించిందో తెలిసిందే. ఆ సీన్‌ నుంచే ఇప్పుడు ఈ కథ పుట్టుకొచ్చిందట. అక్కడి నుంచే సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మైలేజ్‌ కోసం ఈ చిత్రం ఉపయోగపడేలా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. 2024 ఎన్నికల ముందు ఈ సినిమాను విడుదల చేయాలన్నది ప్లాన్‌. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బోయపాటి రామ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌ పూర్తయ్యాక బోయపాటి - బాలయ్య కలయికలో నాలుగో చిత్రంతో రంగంలోకి దిగబోతున్నారని సమాచారం.

Updated Date - 2023-05-25T11:22:08+05:30 IST