Nbk 108: అన్న దిగిండు.. ఈసారి ఊహకు మించి!

ABN , First Publish Date - 2023-03-22T12:25:49+05:30 IST

నందమూరి బాలకృష్ణ, (Nandamuri Balakrishna) అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే!

Nbk 108: అన్న దిగిండు.. ఈసారి ఊహకు మించి!

నందమూరి బాలకృష్ణ, (Nandamuri Balakrishna) అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! బాలకృష్ణ 108 (NBK 108) చిత్రంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌(Kajal) కథానాయిక. ఉగాది సందర్భంగా అనిల్‌ రావిపూడి బాలయ్య అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఎన్‌బీకే 108 నుంచి బాలయ్య ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ చూస్తే బాలకృష్ణను ఎప్పుడూ చూడని రీతిలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఉన్నారు వింటేజ్‌ లుక్‌లో బాలయ్య అదరహో అనేలా ఆ పోస్టర్‌ ఉంది. ఫస్ట్‌ లుక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన అనిల్‌ రావిపూడి ‘అన్న దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం బాలయ్య లుక్‌ నెట్ట్టి విపరీతంగా వైరల్‌ అవుతోంది.

కాజల్‌ హీరోయిన్‌గా, శ్రీలీల బాలకృష్ణకు కూతురుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్ర్కీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-03-22T12:36:39+05:30 IST