NBK108: బాంబార్డింగ్‌ అప్‌డేట్‌...

ABN , First Publish Date - 2023-06-03T13:30:56+05:30 IST

అన్న దిగుతుండు’ అంటూ ‘ఎన్‌బీకే108’ చిత్రం గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! అనిల్‌ స్టైల్‌ కామెడీతో పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.

NBK108: బాంబార్డింగ్‌ అప్‌డేట్‌...

‘అన్న దిగుతుండు’ అంటూ ‘ఎన్‌బీకే108’ (NBK 108) చిత్రం గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! అనిల్‌ స్టైల్‌ కామెడీతో పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజును (NBK Birthday Special) పురస్కరించుకుని చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఈ మేరకు ఎన్‌బీకె108 టీమ్‌ ట్వీట్‌ చేసింది. ‘‘అన్న దిగుతుండు’.. బాంబు పేలుడు (Bombarding Update) లాంటి అప్‌డేట్‌, ఆయన పుట్టిన రోజున ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వని పవర్‌ఫుల్‌ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నాం’’ అంటూ పోస్ట్‌ చేశారు. దీన్ని బట్టి పవర్‌ఫుల్‌ టైటిల్‌ను గానీ, గ్లింప్స్‌ కానీ విడుదల చేస్తారని అర్థమవుతోంది.

ఇప్పటికే అనిల్‌ రావిపూడి (Anil raavipudi) ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్‌ గురించి హింట్‌ ఇచ్చారు. ఇప్పటి వరకూ చూడని బాలయ్యని ఈ చిత్రంలో చూడబోతున్నారని ఫస్ట్‌ లుక్‌ విడుదల సమయంలోనే చెప్పారు. తాజా పోస్ట్‌తో ఆ అంచనాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. షైన్‌స్ర్కీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-06-03T20:31:25+05:30 IST