Nayanatara : నయనతార తన కోరిక ఇలా నెరవేర్చుకోనుందా?

ABN , First Publish Date - 2023-11-26T12:23:09+05:30 IST

ఇప్పటి దాకా కథానాయికగా  తెరపై సందడి చేసిన నయనతార (nayanatara) కొత్త అవతారం ఎత్తనుందా? దర్శకత్వం వైపు తన దృష్టి మళ్లించనుందా? అంటే అవుననే చెబుతున్నాయి సినీ వర్గాలు. అందుకు నయన్  ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ కారణం.

Nayanatara : నయనతార తన కోరిక ఇలా నెరవేర్చుకోనుందా?

ఇప్పటి దాకా కథానాయికగా  తెరపై సందడి చేసిన నయనతార (nayanatara) కొత్త అవతారం ఎత్తనుందా? దర్శకత్వం వైపు తన దృష్టి మళ్లించనుందా? అంటే అవుననే చెబుతున్నాయి సినీ వర్గాలు. అందుకు నయన్  ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ కారణం. తాజాగా నయన్  కెమెరా వెనుక నిలబడి చూస్తున్న ఫొటోను తన ఇంస్టాగ్రామ్లో  పోస్ట్‌ చేశారు. 'మ్యాజిక్‌ ఆఫ్‌ న్యూ బిగినింగ్స్‌.. నమ్మండి’ అని రాసుకొచ్చారు, దీంతో మెగా ఫోన్‌ పట్టడానికి రెడీ అవుతున్నారని అభిమానులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది సెట్‌లో సరదాగా తీసుకున్నా ఫొటోనా? లేక నయనతార భవిష్యత్తులో దర్శకత్వం వహించడానికి సిద్థం అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. (Nayanatara new journey(

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకత్వం వహించాలనే తన కోరికను బయటపెట్టింది. అయితే ఆ దారిలో నయన వెళ్తుందా? లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నయన దక్షిణాదిలో అగ్ర తారగా ఎదిగింది. తర్వాత రౌడీ పిక్చర్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా అవతారం ఎత్తారు. అంతేకాదు వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ ఫుల్‌గా రాణిస్తున్నారు. కమర్షియల్‌ యాడ్స్‌తోనూ బిజీగా ఉన్నారు. కవల పిల్లలు, భర్తతో వ్యక్తిగత జీవితాన్ని సంతృప్తికరంగా ఆస్వాదిస్తోంది. తాజాగా ఆమె నటించిన ుఅన్నపూరణి చిత్రం డిసెంబర్‌ ఒకటో తేదీ తెరపైకి రానుంది. నయనతార నటిస్తున్న మరో చిత్రం మన్నాంగట్టి నిర్మాణ దశలో ఉంది.

Updated Date - 2023-11-26T12:23:45+05:30 IST