సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naveen Polishetty: ఆ ట్వీట్‌తో ‘నాటు నాటు’ స్టెప్‌ వేశాం

ABN, First Publish Date - 2023-05-04T17:31:44+05:30

ఏ సినిమాకైనా పెద్ద స్టార్‌ల ప్రశంసలు దక్కితే ఆ కిక్కేవేరు. ఆ సినిమాకు వచ్చే మైలేజ్‌ వేరు. అనుష్క శెట్టి, నవీన్‌ పోలిశెట్టి నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ టీజర్‌ చూసిన రామ్‌చరణ్‌, ప్రభాస్‌ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ సినిమాకైనా పెద్ద స్టార్‌ల ప్రశంసలు దక్కితే ఆ కిక్కేవేరు. ఆ సినిమాకు వచ్చే మైలేజ్‌ వేరు. అనుష్క శెట్టి, నవీన్‌ పోలిశెట్టి (Naveen polishetty)నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ (MissShettyMrPolishetty) టీజర్‌ చూసిన రామ్‌చరణ్‌ (Ram charan), ప్రభాస్‌ స్పందించారు. టీజర్‌ నచ్చిందని సోషల్‌ మీడియా వేదికగా ఈ ప్యాన్‌ ఇండియా స్టార్స్‌ ఇద్దరూ పోస్ట్‌ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ప్రభాస్‌, రామ్‌చరణ్‌ కూడా టీజర్‌ అదిరిందంటూ అభినందనలు తెలిపారు. అనుష్క చాలా రోజుల తర్వాత తెరపై కనిపించనున్న సినిమా కావడంతో తన అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభాస్‌, రామ్‌చరణ్‌ శుభాకాంక్షలు సినిమా ఎసెట్‌ అయ్యేలా ఉంది. ఈ టీజర్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేసి వినోదాత్మకంగా ఉందని, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘టీజర్‌ నాకు బాగా నచ్చింది. రిఫ్రెష్‌గా కనిపిస్తోంది’’ అని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడీయన్‌గా, అనుష్క చెఫ్‌గా కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మహేష్‌ బాబు.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

నాటు నాటు స్టెప్‌ వేశాం సర్‌...

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ టీజర్‌ బావుందంటూ రామ్‌చరణ్‌ చేసిన ట్వీట్‌ పట్ల ఆనందం వ్యక్తం చేశారు నవీన్‌ పోలిశెట్టి. ‘రామ్‌చరణ్‌ సర్‌ మీ ట్వీట్‌ చూశాక ఆనందంతో మేమంతా ‘నాటు నాటు’ స్టెప్‌ వేశాం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-04T17:31:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!