PavitraNaresh: అక్కడ కూడా పవిత్రని వదలని నరేష్

ABN , First Publish Date - 2023-05-15T15:26:06+05:30 IST

అతని స్వంత ప్రెస్ మీట్ అయినా, వేరే సినిమా అయినా, ప్రీ రిలీజ్ వేడుక అయినా, లేదా ఇంకో సినిమా గురించి మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా, పవిత్ర పేరు చెప్పకుండా మాత్రం వదలటం లేదు నరేష్. ఇప్పుడేమి చెప్పాడంటే...

PavitraNaresh: అక్కడ కూడా పవిత్రని వదలని నరేష్
Naresh at Anni Manchi Sakunamule pre-release event

సీనియర్ నటుడు నరేష్ (VK Naresh), పవిత్ర (PavitraLokesh) లు వార్తల్లో ఉంటూనే వున్నారు. 'మళ్ళీ పెళ్లి' (MalliPelli) అనే సినిమాలో ఈ ఇద్దరూ లీడ్ పెయిర్ గా వెయ్యటం, ఆ టీజర్, ట్రైలర్ రెండూ వైరల్ కావటం అందరికీ తెలిసిన విషయమే. నరేష్ కి నిజ జీవితంలో జరిగిన సంఘటనలే ట్రైలర్ లో కనిపించినా, ఈ సినిమా తనకి సంబందించినది కాదని చెప్పాడు నరేష్. పవిత్ర తో కలిసి ఉంటున్నా, పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోలేదు, కానీ వాటన్నిటికన్నా రెండు మనసులు ఏకమైతే చాలు అని పరోక్షంగా మేము కలిసే వున్నాం అన్నట్టు చెప్పాడు నరేష్.

nareshvk.jpg

ఇదిలా ఉంటే, నిన్న ఆదివారం 'అన్నీ మంచి శకునములే' #AnniManchiSakunamule సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళావేదిక లో జరిగింది. మిగతా యూనిట్ సభ్యులు అందరితో పాటు నరేష్ కూడా హాజరయ్యాడు. తన వంతు స్పీచ్ వచ్చేసరికి, నరేష్ ఈ సినిమా గురించి బాగా చెప్పినా, తన ప్రియురాలు పవిత్రని మాత్రం వదల్లేదు అక్కడ.

Naresh-and-Pavitra.jpg

ఎలా అంటే, ఈ సినిమా షూటింగ్ 'విక్టోరియా పురం' అనే లొకేషన్ లో పెట్టి, అప్పుడప్పుడూ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అవండి అని మంచి భోజనం కూడా పెట్టేవారు. అక్కడ నాకో ఇల్లు కూడా వుంది. చక్కగా పవిత్ర #PavitraLokesh వండి వంట కూడా తీసుకొచ్చేది అని చెప్పాడు నరేష్. ఆ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకి పవిత్ర రాకపోయినా కూడా, #PavitraNaresh నరేష్ పవిత్రని తలుచుకోకుండా మాత్రం ఉండలేకపోయాడు.

నందిని రెడ్డి (NandiniReddy) దర్శకత్వం వచించిన ఈ సినిమా స్వప్న దత్ (SwapnaDutt), ప్రియాంక దత్ (PriyankaDutt) నిర్మాతలుగా వున్నారు. ఇందులో సంతోష్ శోభన్ (SantoshSobhan), మాళవిక నాయర్ (MalavikaNair) లు లీడ్ పెయిర్, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల వుతోంది.

Updated Date - 2023-05-15T15:26:06+05:30 IST