Pavitra Naresh: ఏడడుగులతో ఒక్కటయిన పవిత్రనరేష్ జంట !

ABN , First Publish Date - 2023-03-10T11:43:07+05:30 IST

ప్రముఖ నటుడు, విజయనిర్మల కుమారుడు నరేష్ నాలుగో పెళ్లి నటి పవిత్ర తో జరిగింది. ఈ విషయాన్ని నరేష్ స్వయంగా తన సాంఘీక మాధ్యమాల్లో పెట్టి అందరి ఆశీర్వచనాలు కావాలి అని అన్నాడు. ఈ పెళ్లి వీడియో కూడా విడుదలయి ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది కూడా

Pavitra Naresh: ఏడడుగులతో ఒక్కటయిన పవిత్రనరేష్ జంట !

ఎప్పటినుండో వార్తల్లో వున్న ప్రముఖ నటుడు వి.కె.నరేష్, (VK Naresh) పవిత్ర (Pavitra) ఇప్పుడు పెళ్లి చేసుకున్నారంటూ (NareshPavitraMarriage) వార్తలు బయటకి వచ్చాయి. ఒక వీడియో కూడా బయట వైరల్ అవుతోంది. డిసెంబర్ 31, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెపుతూ నరేష్, పవిత్ర మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఆ మాట నిజం చేస్తూ ఈరోజు అంటే మార్చి 10 వ తేదీన ఇద్దరు పెళ్లిచేసుకున్నట్టు కనపడుతోంది. అయితే దీని మీద నరేష్ కానీ, పవిత్ర కానీ అధికారికంగా ఏమీ మాట్లాడలేదు. అయితే ఇద్దరూ తలంబ్రాలు పోసుకొని, జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకున్నట్టు, ఏడు అడుగులు నడుస్తున్నట్టు వున్న వీడియో మాత్రం బయటకి వచ్చింది.

nareshpavitra.jpg

ఇది నరేష్ కి నాలుగో వివాహం. ఇంతకు ముందు మూడు పెళ్లిళ్లు అయ్యాయి, అందరూ విడిపోయారు. అతని వివాహాలు అన్నీ వివాదాలతోనే ముగిసాయి. ఇంతకు ముందు రమ్య రఘుపతి (Ramya Raghupathi) ని వివాహం చేసుకొని ఆమెకి కూడా విడాకులు ఇచ్చాడు. కానీ ఆ కేసు ఇంకా కోర్టులో ఉన్నట్టు వుంది. కానీ నరేష్, నటి కూడా అయిన పవిత్ర చాలాకాలం నుండి కలిసే వుంటున్నారు. వాళ్లిద్దరూ వివాహం చేసుకుంటారు అని ఎప్పటినుండో అనుకుంటున్నారు. అయితే అది ఇప్పటికి కార్యరూపం దాల్చటం విశేషం. ఈ జంట ఇప్పుడు అధికారికింగా ఒక్కటయి, ఏడడుగులు నడిచి ఒక్క టయినట్టుగా నరేష్ తన ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసాడు.

pavitra-naresh3.jpg

ఒక పవిత్ర బంధం

రెండు మనసులు

మూడు ముడ్లు

ఏడు అడుగులు

మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు

- మీ #PavitraNaresh అని నరేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

pavitra-naresh2.jpg

ఈ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు గతంలో లానే విడుదల చేసిన వీడియో లానే ఈ వీడియో కూడా ఉండటంతో, కేవలం సినిమా ప్రమోషన్స్ కి (NareshPavitra)సంబందించినది అని అభిప్రాయం పడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు, ఈ వీడియోని గమనిస్తే పురోహితుడు తో సహా, అక్కడ వున్నా వారంతా జూనియర్ ఆర్టిస్టుల మాదిరిగానే అనిపించారు. దానికి తోడు వీడియో తీసిన విధానం కూడా సినిమాటిక్ గా ఉండటం తో ఇది పక్కాగా సినిమాకి సంబందించిన వీడియో నే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Read Also: PavitraNaresh: ఆ లిప్ లాక్ నరేష్ బయోపిక్ సినిమాలోది

Updated Date - 2023-03-10T18:28:00+05:30 IST