Pavithra -Naresh: నన్ను నమ్మి వచ్చింది.. ప్రాణం ఉన్నంత వరకూ!

ABN , First Publish Date - 2023-05-20T19:55:51+05:30 IST

కొద్ది రోజులుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాలో ఎక్కడ చూసిన నరేశ్‌(Vk Naresh), పవిత్రా లోకేష్‌ల (pavithra lokesh) విషయమే వినిపిస్తోంది, కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో భార్యభర్తలుగా నటించారు. ఇప్పుడు నిజజీవితంలో భార్యభర్తలు కావాలనుకుంటున్నారని టాలీవుడ్‌లో చాలా రోజులుగా టాక్‌ నడుస్తోంది.

Pavithra -Naresh: నన్ను నమ్మి వచ్చింది.. ప్రాణం ఉన్నంత వరకూ!

కొద్ది రోజులుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాలో ఎక్కడ చూసిన నరేశ్‌(Vk Naresh), పవిత్రా లోకేష్‌ల (pavithra lokesh) విషయమే వినిపిస్తోంది, కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో భార్యభర్తలుగా నటించారు. ఇప్పుడు నిజజీవితంలో భార్యభర్తలు కావాలనుకుంటున్నారని టాలీవుడ్‌లో చాలా రోజులుగా టాక్‌ నడుస్తోంది. బహిరంగంగానూ నరేశ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వీరిద్దరి పరిచయం నుంచి నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతితో జరుగుతున్న వివాదాలు, ప్రస్తుతం నరేశ్‌, పవిత్రా లైఫ్‌నే బేస్‌ చేసుకుని ఎమ్మెస్‌ రాజు (Ms Raju) ‘మళ్లీ పెళ్లి’ (Malli pelli) టైటిల్‌తో ఓ సినిమా తీశారు. ఆ చిత్రం విడుదలకు సిద్ధమమైంది. ఈ మేరకు ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు పవిత్రా నరేశ్‌. తాజాగా ఓ కార్యక్రమంలో నరేశ్‌ మాట్లాడుతూ

‘‘నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి తెరకెక్కించిన సినిమా కాదు. సమాజంలోని పరిస్థితులు, ఎంతోమంది ఆలోచనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని (naresh persanal life)ఎమ్మెస్‌ రాజు తెరకెక్కించారు. ఒత్తిడి, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో వివాహ వ్యవస్థ దెబ్బతింటోంది. వైవాహిక బంధంపై మాకున్న గౌరవానికి అద్దం పడుతూ ఈ సినిమా తీశాం. ఇదొక బోల్డ్‌ ఐడియా. సెన్సార్‌ బృందంతోపాటు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రాన్ని చూపించాం. అందరికీ నచ్చింది. యూత్‌ కూడా కనెక్ట్‌ అవుతున్నారు. ఈ మఽధ్యన సోషల్‌మీడియాలో మాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రివెంజ్‌ కోసమే నేను ఈ సినిమా చేశానని అన్నారు. ఎవరి ఉద్దేశాలు వాళ్లకు ఉంటాయి. వాటిని మేము తప్పుబట్టడం లేదు. ఒకరిపై రివెంజ్‌ తీర్చుకోవాలంటే యూట్యూబ్‌ వేదికగా వాళ్లను విమర్శిస్తూ వీడియో పోస్ట్‌ చేయవచ్చు. పోలీస్‌ ేస్టషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. రూ.15 కోట్లు వ్యయంతో రెండు భాషల్లో సినిమా చేయాల్సిన అవసరం లేదు’’ అని నరేశ్‌ తెలిపారు. ‘మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా?’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘ఉదాహరణకు మనం ప్రేమగా ఒక ఇల్లు కట్టుకున్నాం. దురదృష్టవశాత్తు అది కూలిపోయింది. మళ్లీ ఇల్లు కట్టుకుంటామా? లేదా? అలాగే.. నా జీవితం కూలిపోయింది. తన లైఫ్‌ కూలిపోయింది. అది మేము ఎవరికీ చెప్పలేదు. అది చెప్పినప్పుడే సమస్యలు మొదలయ్యాయి. చెప్పకపోతే ఏమీ ఉండేది కాదు. వైవాహిక బంధానికి, మానవ హక్కులకు విలువనిస్తూ ఓ వ్యక్తి ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చింది. నా సినిమాలు నేను చేసుకుంటూ నా తోడుని వెతుక్కున్నా. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ కొత్తదేమీ కాదు. కోర్టే దానికి అంగీకారం తెలిపింది. పెళ్లి అంటే యూనియన్‌ ఆఫ్‌ హార్ట్స్‌. మా మనసులు ఎప్పుడో కలిశాయి. మాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే తప్పకుండా అందర్నీ పిలిచి ఘనంగా చేసుకుంటాం’’ అని నరేశ్‌ చెప్పారు.

పవిత్ర నన్ను నమ్మి వచ్చింది.

అలాగే తన మూడో భార్య గురించి నరేశ్‌ మాట్లాడారు. ‘‘ఒక వ్యక్తి ప్రమేయంతో ఈ తలనొప్పులు మొదలయ్యాయి. కొన్ని పరిస్థితుల తర్వాత నేను విడాకులకు అప్లయ్‌ చేశా. ఆ తర్వాత నుంచి నా పరువుకు భంగం కలిగించాలని, మా ఇద్దర్నీ నాశనం చేయాలని ఆమె ప్రయత్నించింది. ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పవిత్ర నన్ను నమ్మి వచ్చింది. కాబట్టి నా ప్రాణం ఉన్నంతవరకూ నేను ఆమెను కాపాడాలి. అందుకే ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటున్నాను. మా కుటుంబం కూడా మాకు అండగా ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2023-05-20T19:56:16+05:30 IST