సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nani: కొత్తవాళ్లతో తగ్గేదే లే!

ABN, First Publish Date - 2023-01-31T14:58:40+05:30

'దసరా' సినిమా మార్చి 30న విడుదల అవకముందే, నాని ఇంకొక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. అదీ ఇంకొక కొత్త దర్శకుడుతో. ఇప్పుడు కొత్త చిత్రంతో ఇంకో నూతన దర్శకుడు శౌర్యువ్ ని పరిచయం చేస్తున్నాడు

Mega Star Chiranjeevi giving clap to Nani's new film launched on Tuesday, directed by Shouryuv.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'దసరా' (Dasara) సినిమా మార్చి 30న విడుదల అవకముందే, నాని (Nani) ఇంకొక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. అదీ ఇంకొక కొత్త దర్శకుడుతో. 'దసరా' సినిమాతో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే దర్శకుడిని పరిచయం చేస్తూ అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు అని జోస్యం కూడా చెప్పాడు. ఇప్పుడు కొత్త చిత్రంతో ఇంకో నూతన దర్శకుడు శౌర్యువ్ ని పరిచయం చేస్తున్నాడు. ఇది నాని 30వ (Nani30) చిత్రం. నాని ఎక్కువగా కొత్త దర్శకులతో పని చెయ్యటం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాళ్ళు కొత్త తరహా కథలతో, ఇప్పుడు జెనెరేషన్ కి తగ్గట్టుగా సరిపోయే సబ్జక్ట్స్ తీసుకువు వస్తున్నారని నాని వాళ్ళని ప్రోత్సహిస్తున్నది తెలిసింది. నాని కి కూడా కావాల్సింది అదే అని, ప్రతి సినిమా కొత్తగా వుండేటట్టు కనపడాలి అంటే, కొత్త నీరుని తీసుకు రావాలని, అందుకనే కొత్త దర్శకులని ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది.

ఈ సినిమా పాన్ ఇండియా గా తీసుకు వస్తున్నట్టుగా తెలిసింది. అందుకనే ఇందులో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ని కథానాయికగా తీసుకున్నట్టుగా అనుకుంటున్నారు. ఆమె ఇంతకు ముందు 'సీత రామం' (Seetha Ramam) అనే తెలుగు సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టినా, హిందీ ప్రేక్షకులకు మాత్రం ఆమె పరిచయం అక్కరలేని నటి. అందుకని ఆమెని ఈ సినిమాకి కథానాయికగా తీసుకున్నారని తెలిసింది. ఈ సినిమాకి మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొట్టగా, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. చాలామంది దర్శకులు బుచ్చిబాబు, (Buchibabu) కిషోర్ తిరుమల, హను రాఘవపూడి (Hanu Raghavapuri), వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు.

Updated Date - 2023-01-31T14:58:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!