Nani- Dasara: ఆ సినిమా చూపిస్తా.. మాట ఇస్తున్నా!

ABN , First Publish Date - 2023-03-27T18:20:19+05:30 IST

‘దసరా’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక వేదికగా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఓదెల శ్రీకాంత్‌ దర్శకుడు.

Nani- Dasara: ఆ సినిమా చూపిస్తా.. మాట ఇస్తున్నా!

‘దసరా’ (Dasara) సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక వేదికగా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఓదెల శ్రీకాంత్‌ (odela srikanth) దర్శకుడు. ఈ నెల 30న విడుదల కానున్న (Dasara on 30 march) ఈ చిత్రం గురించి నాని మాట్లాడుతూ ‘‘సినిమా వాళ్లకు ఓ ప్రత్యేకమైన భాష ఉంటుంది. మా వరకూ సీడెడ్‌ అంటే మాస్‌ అని అర్థం. ఇప్పటి వరకూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మెప్పించే మాస్‌ చిత్రం చూసి ఉంటారు. ‘దసరా’తో మీ మనసుని హత్తుకునే మాస్‌ సినిమా చూపిస్తా. అది మీకు నేను ఇస్తున్న మాట. అలాగే, మాస్‌ సినిమా చూసి విజిల్స్‌ వేసి ఉంటారు. కానీ, ఈసారి ఆనందం, భావోద్వేగంతో విజిల్స్‌ కొడతారు. ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. దుమ్ము, ధూళిని లెక్కచేయకుండా ఏడాదిపాటు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ఇదొక స్పెషల్‌ సినిమా కానుంది. ఈ చిత్రంలో నాకు స్నేహితులుగా నటించిన ఆర్టిస్ట్‌లు అందరూ మరెన్నో చిత్రాల్లో నటిస్తారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌, ఫైట్‌ మాస్టర్‌కు డేట్స్‌ దొరకడం కష్టం కావొచ్చు. అవినాష్‌ కొల్లా 22 ఎకరాల్లో ‘వీర్లపల్లి’ అనే ఓ ఊరును క్రియేట్‌ చేశారు. డెఫినెట్‌గా మా చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. అలాగే డైరెక్షన్‌ టీమ్‌లో ఉన్న 12 మంది సభ్యులు వీలైనంతగా త్వరగా దర్శకులు అయిపోవాలి. (nani Comments on Dasara) నేనూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. వాళ్ల జీవితం ఎలా ఉంటుందో నేను దగ్గర నుంచి చూశా. టాలీవుడ్‌ నిర్మాతలందరికీ చెబుతున్నా.. ‘దసరా’ అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ అందరికీ అడ్వాన్స్‌ చెక్‌లు ఇచ్చి పెట్టుకోండి . వీళ్లల్లో ఎవరు ఎప్పుడు దర్శకులు అయిపోతారో తెలియదు. ‘నేను లోకల్‌’ తర్వాత ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేయాలని నేనూ- కీర్తి అనుకున్నాం. ఇంతకు మించిన అద్భుతమైన చిత్రం ఏ నటీనటులకు దొరకదు. మార్చి 30న టాప్‌ లేచేపోయే సినిమా మేము మీకు ఇస్తున్నాం. మీరు కూడా టాప్‌ లేచిపోయేలా స్పందన ఇస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

Untitled-2.jpg

Updated Date - 2023-03-27T18:20:20+05:30 IST