సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nani: నాని శ్రద్ధ కపూర్ తో ఏమి చేస్తున్నాడో తెలుసా...

ABN, First Publish Date - 2023-05-31T12:11:28+05:30

నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ పూణేలో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఇది ఏమైనా నాని రాబోయే సినిమా కోసం అనుకుంటున్నారా. కానీ కాదు. మరి ఈ ఇద్దరూ పూణే లో ఏమి చేస్తున్నారు.

Nani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు టాలీవుడ్ నటులు అందరూ చాలా కమెర్షియల్ యాడ్స్ లో వస్తున్నారు. చాలా కంపెనీలు ఇప్పుడు తెలుగు నటుల వేపే ఎక్కువ చూస్తోంది, తమ బ్రాండ్ ని ప్రమోట్ చెయ్యడానికి. ఆలా ఎంతో మంది చేస్తున్నారు కూడాను. ఆలా చేస్తున్న నటుల్లో నాని (Nani) కూడా ఒకడు. అతను ఇప్పటికే కొన్ని కొన్ని కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు, ఇప్పుడు ఇంకా కొన్ని వస్తున్నాయి. ఎందుకంటే పాన్ ఇండియా నటుల్లో నాని కూడా చేరిపోయాడు కదా.

అయితే ఇప్పుడు నాని ఎక్కడున్నాడో తెలుసా, పూణే (Pune) లో వున్నాడు. అక్కడ ఏమి చేస్తున్నాడు అని అనుకుంటున్నారా, షూటింగ్ చేస్తున్నాడు, కానీ అతని సినిమా షూటింగ్ కాదు. వేరే షూటింగ్. అదే అక్కడ ఒక యాడ్ షూట్ కోసం వెళ్ళాడు అని తెలిసింది. అది కూడా ఒక సాఫ్ట్ డ్రింక్ యాడ్ కోసం అని తెలిసింది. ఈ యాడ్ లో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ (ShraddhaKapoor) కూడా ఉంటుంది, ఈ ఇద్దరు ఈ సాఫ్ట్ డ్రింక్ కోసం అక్కడ షూటింగ్ చేస్తున్నారు అని తెలిసింది.

నాని 'దసరా' #Dasara సినిమా తో పెద్ద హిట్ కొట్టాడు. ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (SrikanthOdela) వివాహానికి ఈరోజు వెళ్ళవలసి వుంది, కానీ ఈ యాడ్ షూట్ ఉండటం, ముందుగానే శ్రద్ధ కపూర్ తేదీలు కూడా ఫిక్స్ అవటం తో వెళ్లలేకపోతున్నాడు అని తెలిసింది. కానీ దర్శకుడికి మెసేజ్ పెట్టాడని తెలిసింది.

నాని తన తదుపరి సినిమా షూటింగ్ కూడా మొదలెట్టేసాడు, విడుదల తేదీ కూడా ప్రకటించేశాడు. మధ్య మధ్యలో ఇలా యాడ్స్ చేస్తూ మళ్ళీ వచ్చే వారం నుండి సినిమా షూటింగ్ #Nani30 మొదలెడతాడని తెలిసింది. శౌర్యవ్ (Shouryav) ఆ సినిమాకి దర్శకుడు, మృణాల్ ఠాకూర్ (MrunalThakur) కథానాయికగా చేస్తోంది.

Updated Date - 2023-05-31T12:11:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!