Venkatesh Maha comments: కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌ దెబ్బ... నవ్వినవారు అబ్బా.!

ABN , First Publish Date - 2023-03-06T18:47:04+05:30 IST

తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి మనిషి గురించి సినిమాలు తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం.

Venkatesh Maha comments: కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌ దెబ్బ... నవ్వినవారు అబ్బా.!

‘కేజీఎఫ్‌’ చిత్రంపై వెంకటేశ్‌ మహా ఘాటైన వ్యాఖ్యలు...

మండి పడుతున్న అభిమానులు... (Comments on KGF)

క్షమాపణ చెప్పాలని డిమాండ్‌.. లేదంటే తీవ్ర పరిణామాలు (KGF fans demand)

దర్శకురాలు నందినీరెడ్డి క్షమాపణ! (Nandini reddy Apologies)

‘‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి మనిషి గురించి సినిమాలు తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం. కోట్లకు కోట్లు వసూళ్లు తీసుకొస్తున్నాం’’ అంటూ ‘కేజీఎఫ్‌’ చిత్రాన్ని ఉద్దేశించి యువ దర్శకుడు వెంకటేశ్‌ మహా చేసిన ఘాటైన వ్యాఖ్యలు (Venkatesh maha Comments on KGf movie) ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసభ్య పదజాలంతో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ‘కేజీఎఫ్‌’ ఫ్యాన్స్‌ ఖండిస్తున్నారు. సదరు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన చర్చా వేదికలో దర్శకులు శివా నిర్వాణ, వివేక్‌ ఆత్రేయ, నందినిరెడ్డి, మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి, వెంకటేశ్‌ మహా పాల్గొన్నారు. కమర్షియల్‌ సినిమా అనే టాపిక్‌ గురించి చర్చ జరుగుతున్నప్పుడు వెంకటేశ్‌ మహా కన్నడ హీరో యశ్‌ నటించిన ‘కేజీయఫ్‌’పై కామెంట్స్‌ చేశారు. ఆ వీడియో వైరల్‌ కావడంతో అభిమానులు మండిపడుతున్నారు. వెంకటేశ్‌ మహా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని సోషల్‌ మీడియాలో హెచ్చరిస్తున్నారు. ఆ చర్చలో ఉన్న నందినిరెడ్డి, వివేక్‌ ఆత్రేయ, సీనియర్‌ డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ వెంకటేశ్‌ మహా వ్యాఖ్యలకు పగలబడుతూ నవ్వడం ‘కేజీఎఫ్‌, యశ్‌ అభిమానులకు నచ్చలేదు. దాంతో ఒక్కసారిని వారిని టార్గెట్‌ చేసి ట్రోల్‌ చేయడంతో దర్శకురాలు నందినిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా క్షమాపణ తెలిపారు. అయితే ఆ పక్కనే ఉన్న వివేక్‌ ఆత్రేయ, సీనియర్‌ డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ వెంకటేశ్‌ మహా ఎలా స్పందిస్తారో చూడాలి.

‘‘కమర్షియల్‌ అంశాలతో తీసే ప్రతి సినిమా విజయం సాధిస్తుంది అంటే చిత్ర బృందం పడిన కష్టం ప్రేక్షకులకు నచ్చిందని అర్థం. తాజాగా ‘కమర్షియల్‌ సినిమా’పై తాజాగా జరిగిన చర్చా కార్యక్రమంలో మేం చేసిన వ్యాఖ్యలు ఎవరినీ కించపరచాలని కాదు. ఆ వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించండి. ఆ సమయంలో వెంకటేశ్‌ మహా మాటాడిన విధానం, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌కు నాకు నవ్వొచ్చింది. అది ఎలాంటి తప్పుడు సంకేతాలు పంపిందో నాకిప్పుడు అర్థమైంది’’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-06T18:47:05+05:30 IST