DirectorNandiniReddy: ఆహ్లాదంగా, ఆత్మీయంగా, సకుటుంబంగా చూసే విధంగా...

ABN , First Publish Date - 2023-05-12T17:22:49+05:30 IST

ప్రస్తుతం వున్న దర్శకుల్లో చక్కటి తెలుగుదనం వుట్టిపడి, కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు తీస్తున్న దర్శకురాలు నందిని రెడ్డి. అలాగే వున్నా కొద్దిమంది మహిళా దర్శకురాళ్లలో కూడా ఇప్పుడు ఆమె ఒకరు. ఇప్పుడు ఆమె తీసిన 'అన్నీ మంచి శకునములే' విడుదలకి సిద్ధంగా వుంది..

DirectorNandiniReddy: ఆహ్లాదంగా, ఆత్మీయంగా, సకుటుంబంగా చూసే విధంగా...
Nandini Reddy

తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకులను వేళ్ళమీద లెక్కపెట్టగలిగే విధంగా చాలా తక్కువమంది వున్నారు. అప్పట్లో ఒక భానుమంతి రామకృష్ణ (BhanumanthiRamakrishna), తరువాత విజయనిర్మల (Vijayanirmala) ఇలా ఎక్కువ సినిమాలు చేసిన ఇద్దరే మహిళా దర్శకురాలు వున్నారు మన పరిశ్రమలో. కానీ తరువాతి రోజుల్లో అసలు రావటమే మానేశారు, ఎందువల్ల అనేది ఈరోజుకి అర్థం కాదు. బి జయ (B Jaya) గారు కొన్ని సినిమాలు తీశారు, ఆమె ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడున్న కొద్దిమంది దర్శకురాళ్లలో నందిని రెడ్డి (BV Nandini Reddy) ఒకరు. తీసినవి నాలుగో ఐదో అయినా, వాటితో నందిని మార్కు కచ్చితంగా ఉంటుంది అన్నపేరు తెచ్చుకుంది.

nandinireddy.jpg

చిన్న చిన్న ఆప్యాయతలు, కుటుంబం, భావోద్వేగాలు, పెళ్లి అంటే ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, తల్లి కొడుకుల అనుబంధం ఇవన్నీ ఆమె సినిమాల్లో కనిపిస్తాయి. అలాగే ఆమె సినిమాల్లో సన్నివేశాలు మన ఇంట్లో, మన చుట్టుపక్కల, పక్కవాళ్ళ ఇంట్లో జరుగుతూ వున్నట్టుగా ఉంటుంది. ఆమెకి మిగతా దర్శకులకూ తేడా ఏంటంటే, నందిని చిన్న చిన్న సన్నివేశాల్లోనే పెద్ద భావోద్వేగాలను పెట్టి, ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలా చేయిస్తుంది.

ams.jpg

'ఓ బేబీ' (Oh! Baby) సినిమాలో చివరలో సమంత (Samantha), రావు రమేష్ (Rao Ramesh) ల మధ్య సన్నివేశం, అలాగే ఇంట్లో ఆ కుటుంబం డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకునే సన్నివేశం, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) దగ్గరికి వచ్చేటప్పుడు, సమంత అతని చెప్పులు తుడిచి పెట్టడం, ఇలా చిన్న చిన్న వాటిల్లోనే ఎంతో భావోద్వేగాన్ని చూపగల సత్తా వున్నా దర్శకురాలు. అలాగే 'కల్యాణ వైభోగ్యమే' (KalyanaVaibhogame) అన్న సినిమాలో, చిన్న చిన్న కొట్లాట, ఆ ప్రేమ, ఆ కుటుంబ బాంధవ్యాలు, వివాహం అంటే ఎలా, ఏమిటి ఇవన్నీ ఎంతో హృద్యంగా, యింటిల్లీ పాదీ చూసే విధంగా తీసింది నందిని రెడ్డి. అందుకే ఆమె సినిమాలు అన్నీ ఆహ్లాదంగా ఉంటాయి.

ohbaby.jpg

మొదటి సినిమా 'ఆలా మొదలయింది' (AlaModalaindi) అయితే కడుపుబ్బా నవ్వుకునే ఆరోగ్యకరమైన హాస్యం వుండే సినిమా. కొత్తవాళ్లతో తీసినది, అప్పట్లో ఒక కొత్త ఒరవడికి ఆ సినిమా నాంది పలికింది. అయితే ఆ సినిమాలో చాలా హాస్య సన్నివేశాలు, క్లైమాక్స్ ఆ సినిమా విజయానికి ఎంతో దోహదం చేశాయి. నాని (Nani), నిత్య మీనన్ (NithyaMenen) ఇద్దరూ మంచి నటులే. నానికి అప్పటికి అంత స్టార్ డమ్ కూడా లేదు, కానీ ఆ సినిమా అతని కెరీర్ కి ఒక మెట్టు పైకి ఎక్కేట్టు చేసింది. అలాగే నిత్య మీనన్ ఈరోజు ఒక అద్భుత నటి అంటున్నారు అంటే కారణం ఆమె మొదటి సినిమా 'ఆలా మొదలైంది'. ఈ ఇద్దరికీ నందిని రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ లాంటిది ఈ సినిమా అనుకోవచ్చు.

nandinireddy3.jpg

ఇప్పుడు 'అన్ని మంచి శకునములే' (Anni Manchi Sakunamule) అనే సినిమాతో వస్తోంది. ఇందులో కూడా రెండు కుటుంబాల మధ్య నడిచే కథ ఇది అని అంటున్నారు. ఆమె సినిమాల్లో విలన్స్, పెద్ద పెద్ద పోరాట సన్నివేశాలు ఏమీ వుండవు, అందుకని ఈ రాబోయే సినిమా కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే నందిని రెడ్డి సినిమా అంటే ఇప్పుడు వస్తున్న యాక్షన్, మసాలా, క్షుద్ర, లౌడ్ సినిమాలతో పోలిస్తే ఎంతో చక్కగా, హాయిగా, ఆనందంగా ప్రేక్షకుడికి కావలసిన వినోదాన్ని ఇస్తుంది అని అనుకుంటారు.

Updated Date - 2023-05-12T17:23:52+05:30 IST