Nandini Reddy fires on Reporter: సినిమా ప్రెస్ మీట్ లో రసాభాస

ABN , First Publish Date - 2023-04-22T11:24:34+05:30 IST

ఇంకో వివాదాస్పద ఫిలిం ప్రెస్ మీట్ జరిగింది, అయితే ఈసారి ఈ ప్రెస్ మీట్ తెలంగాణాలో కాకుండా, ఆంధ్రాలోని తిరుపతి లో అయింది. దర్శకురాలు నందిని రెడ్డి సినిమా 'అన్ని మంచి శకునములే' సినిమా ప్రెస్ మీట్ జరిగినప్పుడు, మీడియా వాళ్ళకి ఆమెకి మధ్య కొంచెం వాదోపవాదాలు జరిగాక, చివరికి...

Nandini Reddy fires on Reporter: సినిమా ప్రెస్ మీట్ లో రసాభాస
Nandini Reddy at a media conference in Tirupati promoting her film

ఈమధ్య సినిమా ప్రెస్ మీట్ లు అన్నీ చాలామట్టుకు వివాదాలతో ముగుస్తున్నాయి. అలాగే కొంతమంది రిపోర్టర్స్ ప్రశ్నలు అడిగే విధానం, సమాధానాలు కూడా సాంఘికా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఇంకొకటి జరిగింది. ఈసారి ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో (Tirupati) దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) తన సినిమా 'అన్నీ మంచి శకునములే' #AnniManchiSakunamule ప్రచారంలో భాగంగా ఇది జరిగింది. ఈ సినిమా ప్రచారాల నిమిత్తం తిరుపతి వెళ్లి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ చిత్ర నిర్వాహకులు.

annimanchisakunamaule.jpg

మే 18న విడుదల అవుతున్న ఈ చిత్ర ప్రచారంలో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి, లీడ్ పెయిర్ అయిన సంతోష్ శోభన్ (Santosh Sobhan), మాళవిక నాయర్ (Malavika Nair) లు మాట్లాడారు. ముందు నందిని రెడ్డి మాట్లాడింది, తరువాత మాళవిక నాయర్ మాట్లాడుతున్నప్పుడు ఆమె సీనియర్ నటి షావుకారు జానకి (Shavukar Janaki) తో ఈ సినిమాలో నటించాను అని, ఇది రెండో సారి ఆమెతో నటించటం అని చెప్పింది. వెంటనే నందిని రెడ్డి కూడా మీడియా వాళ్ళకి స్పెషల్ గా ఆ విషయాన్నీ చెపుతూ 'ఇప్పుడున్న జనరేషన్ నటుల్లో మాళవిక నాయర్ జానకి గారితో రెండు సార్లు చేసింది' అన్న విషయాన్ని నొక్కి చెప్పింది. ఆ తరువాత కొంత వాదోపవాదాలు జరిగిన కొంతసేపటికి ఆ ఈవెంట్ సజావుగానే సాగింది.

nandinireddy1.jpg

దానికి మీడియా వాళ్ళు ఏంటో అదేదో తప్పు చెప్పినట్టుగా నందిని రెడ్డి ని ఎందుకు అన్ని సార్లు రిపీట్ చేస్తున్నారు, చేయొద్దు అని వాగ్వివాదానికి దిగారు. పదే పదే అదే విషయాన్ని ఎందుకు చెప్తారు అని ఒక రిపోర్టర్ అడిగినప్పుడు, ఆలా ఏమి చెప్పలేదు సర్, "నేను నా సినిమాలు ఏమి చేసానో చెప్పను. ఈ సినిమా గురించి చెప్పాను. అంతే. ఆ అబ్బాయి కూడా తన సినిమాలు గురించి చెప్పాడు," అంతే అని చెప్పింది నందిని రెడ్డి. అందులో కొంతమంది తెలీదు అన్నట్టుగా మాట్లాడినట్టున్నారు, దానికి నందిని రెడ్డి, "పోనీలెండి సర్, మేము షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ని తీసుకొని రాలేదు. మేము అందరం ఏ స్థాయి డైరెక్టర్ నో, ఏ స్థాయి నటులమో తెలుసు," అని చెప్పింది నందిని రెడ్డి. "మీరు ప్రెస్ నేను ఎక్కువగా మాట్లాడకూడదు. నాది కూడా చిత్తూరు. ఇక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారో నాకు తెలుసు," అని చెప్పింది నందిని. అయితే కొందరు వింటారు, కొందరు వినకపోవచ్చు వాళ్ళకి తెలియడానికి మళ్ళీ మళ్ళీ చెపుతున్న అని కూడా చెప్పింది.

అయితే ఇందులో భాగంగా నందిని రెడ్డి ఒక రిక్వెస్ట్ చేసింది. ఇలాంటి ప్రెస్ మీట్ లకి వచ్చేటప్పుడు మా సినిమా నుండి కొన్ని పాటలు, టీజర్ లు విడుదల అయ్యాయి, మీరు అందులో కొన్ని చూసి, సినిమా గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని నన్ను ఏమైనా మంచి ప్రశ్నలు నన్ను అడిగితే బాగుంటుంది అని నేను ఎక్ష్పెక్త్ చేసాను. ఇది నా రిక్వెస్ట్ అంతే అండీ.

Updated Date - 2023-04-22T11:24:34+05:30 IST