Nandamuri Mokshagna: అప్పుడే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌... సోషల్‌ మీడియాలో వైరల్‌!

ABN , First Publish Date - 2023-06-10T14:16:21+05:30 IST

నందమూరి బాలకృష్ణ(NBK) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) హీరోగా ఎంట్రీ గురించి (Hero Entry) చాలాకాలంగా చర్చ నడుస్తోంది. బాలకృష్ణ ప్రతి పుట్టినరోజున మోక్షజ్ఞ ఎంట్రీకు సంబంధించి ప్రకటన వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు మోక్షజ్ఞ ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి ఓ ఆసక్తికర సందేశం వచ్చింది. అలాగే అతని లేటెస్ట్‌ ఫొటో కూడా షేర్‌ చేశారు.

Nandamuri Mokshagna: అప్పుడే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌... సోషల్‌ మీడియాలో వైరల్‌!

నందమూరి బాలకృష్ణ(NBK) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) హీరోగా ఎంట్రీ గురించి (Hero Entry) చాలాకాలంగా చర్చ నడుస్తోంది. బాలకృష్ణ ప్రతి పుట్టినరోజున మోక్షజ్ఞ ఎంట్రీకు సంబంధించి ప్రకటన వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య మాత్రం 'అతను చదువుకుంటున్నాడు... అతని సినిమా ఎంట్రీ అనేది దైవేచ్ఛ' అంటూ సమాధానమిచ్చేవారు. అయితే ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని బాలయ్య కూడా ఇటీవల ఓ వేదికపై చెప్పారు. నేడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఈ ఏడాది మోక్షజ్ఞ నుంచి సినిమా తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మోక్షజ్ఞ ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి ఓ ఆసక్తికర సందేశం వచ్చింది. అలాగే అతని లేటెస్ట్‌ ఫొటో కూడా షేర్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ చాలా స్లిమ్‌ లుక్‌లో అలరించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అలాగే ‘గర్జించడానికి రెడీ.. డేట్‌ గుర్తు పెట్టుకోండి అంటూ 6-9-2024 డేట్‌ను వేశారు. అంటే నందమూరి మోక్షజ్ఞ హీరోగా సినిమా ఖాయమైందని, వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 6న సినిమా విడుదల అని ఆ పోస్ట్‌లు పేర్కొన్నారు. అయితే దీన్ని బట్టి మోక్షజ్ఞ త్వరలోనే సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నాడని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బాలకృష్ణ, ఆయన టీమ్‌ నుంచి రాలేదు. ఆ ట్వీట్‌ నిజమైతే వచ్చే ఏడాది నందమూరి మోక్షజ్ఞను తెరపై చూడొచ్చని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయిఏత ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది తెలియదు. (Release date viral)

Updated Date - 2023-06-10T14:16:21+05:30 IST