సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

TarakaRatna: తారకరత్న చిన్న కర్మలో ఆయన పెద్ద కుమార్తె ఫోన్‌లో బాలయ్యకు ఏం చూపించిందంటే..

ABN, First Publish Date - 2023-02-23T12:41:38+05:30

యువ నటుడు, నందమూరి తారకరామారావు మనవడు, నందమూరి తారకరత్న చిన్న కర్మ నిన్న బుధవరాం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో జరిగింది. దీనికి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ నటుడు, నందమూరి తారకరామారావు మనవడు, నందమూరి తారకరత్న (#TarakaRatna) చిన్న కర్మ నిన్న బుధవరాం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో జరిగింది. దీనికి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మొదటగా అక్కడికి వెళ్లి అక్కడ అన్ని ఏర్పాట్లను తానే దగ్గరుండి చూసుకొని, అక్కడ జరగాల్సిన కార్యక్రమం అంతా దగ్గరుండి జరిపించారు. బాలకృష్ణ, దివంగత తారకరత్న పిల్లలతో మాట్లాడిన తీరు, ముఖ్యంగా తారకరత్న కూతురు నిషికతో ‘మీకేమి భయం లేదు.. నేనున్నాను’ అన్నట్టుగా వాళ్ళకి భరోసా ఇస్తున్నట్టుగా వాళ్ళతో చాలా చనువుగా మాట్లాడిన తీరు చూసి అక్కడున్న అందరూ ముచ్చట పడ్డారు.

అంతేకాదు.. తారకరత్న పెద్ద కుమార్తె తన ఫోన్‌లో బాలకృష్ణకు తండ్రి తమతో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను చూపించి ఆ జ్ఞాపకాలను తాతయ్యతో పంచుకుంది. ఆ కుటుంబాన్ని ‘అలా వదిలేయం.. మేమున్నాం’ అన్నట్టుగా బాలకృష్ణ వారితో మెలిగిన తీరు తారకరత్న కుటుంబంలో ఆత్మ స్థైర్యాన్ని నింపాయని చెప్పడంలో సందేహమే లేదు. తారకరత్న నివాసంలో ఆయన భౌతికకాయం ఉన్న సమయంలో కూడా బాలకృష్ణను చూసిన తారకరత్న పెద్ద కుమార్తె నిషిక (Nishika) పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ తాతయ్య నుంచి ఓదార్పు కోరుకుంది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. తారకరత్న పెద్ద కుమార్తెకు బాలయ్య అంటే ఎంత అభిమానమో ఆ దృశ్యాలు చెప్పకనే చెప్పేశాయి.

ఇక చిన్న కర్మ రోజు తారకరత్న భార్య (#Tarakaratna Wife Alekhya Reddy) కుమిలిపోయిన దృశ్యాలు అక్కడికి వెళ్లిన వారిని, ఆ వీడియోను చూసిన వారినీ కంటతడి పెట్టించాయి. ఏడడుగులు నడిచిన తోడు వీడిపోయి వెళ్లడంతో ఆమె పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. తారకరత్న భార్య అలేఖ్య దుఃఖం, బాధ ఎవరూ తీర్చలేనిది. ఆమెని చూస్తుంటేనే గుండె తరుక్కుపోతోంది. ముగ్గురు చిన్న పిల్లలు, వాళ్ళ పెంపకం అన్నీ ఆమె భుజస్కందాల మీద ఉన్నాయి ఇప్పుడు.

ఆమె తారకరత్న ఫోటో చూసి ఆగకుండా విలపించిన తీరు చూసినవాళ్ళను కూడా కన్నీళ్లు పెట్టించింది.. బుధవారం నాడు నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి తారకరత్నకు నివాళులు అర్పించి, చిన్న కర్మలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్నీ చేయించి, అందరినీ తనే రిసీవ్ చేసుకొని, మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయించి, దగ్గరుండి తనే చూసుకున్నారని తెలిసింది.

Updated Date - 2023-02-23T12:41:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!