Nandamuri: 'ఫలక్‌నుమా దాస్' సీక్వెల్ లో ఈ నందమూరి హీరో

ABN , First Publish Date - 2023-03-24T16:19:31+05:30 IST

'దాస్ క ధమ్కీ' విజయంతో విశ్వక్ సేన్ త్వరలో తన స్వంత బ్యానర్ మీద 'ఫలక్‌నుమా దాస్' కి సీక్వెల్ తీయడానికి సంసిద్దుడు అవుతున్నాడు. అయితే ఇందులో ఒక నందమూరి హీరో నటిస్తున్నాడు అని వార్త. ఇంతకీ ఆ నందమూరి హీరో ఎవరంటే...

Nandamuri:  'ఫలక్‌నుమా దాస్' సీక్వెల్ లో ఈ నందమూరి హీరో

విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇప్పుడు మంచి జోరు మీద వున్నాడు. మొన్న ఉగాది పండగ నాడు విడుదల అయిన 'దాస్ క ధమ్కీ' (Das Ka Dhamki) విజయం వైపు దూసుకు వెళుతుంటే, ఇప్ప్పుడు తన రాబోయ్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. 'గామి' (Gami) విడుదల రెడీ అవుతోంది, అలాగే ఇంకో రెండు సినిమాలు లైన్ అప్ లో వున్నాయి. తరువాత తన స్వంత బ్యానర్ మీద ఇంకో సినిమా తీస్తా అని చెపుతున్నాడు విశ్వక్ సేన్. అయితే ఈ సొంత సినిమా గురించి ఒక పెద్ద వార్త బయటకి వచ్చింది. ఇది ఇంతకు ముందు అతను తీసిన 'ఫలక్‌నుమా దాస్' (Falaknuma Das) కి సీక్వెల్ గా ' 'ఫలక్‌నుమా దాస్ 2' (Falaknuma Das 2) గా వస్తోంది అని వార్త.

nandamuribalakrishna-vishwa.jpg

ఇందులో ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈ సినిమా ఒక మల్టీ-స్టార్రర్ (Multi-starrer) గా వుండబోతోంది అని, అలాగే ఒక నందమూరి (Nandamuri) హీరో నటిస్తున్నాడు అని కూడా తెలిసింది. ఆ నందమూరి హీరో మరెవరో కాదు, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అని తెలిసింది. విశ్వక్ సేన్ కి, నందమూరి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ (NTR) తో మంచి సత్సంబంధాలు వున్నాయి. అందుకని బాలకృష్ణ ని కలిసి 'ఫలక్‌నుమా దాస్ 2' కథ వినిపించాడని తెలిసింది. అందులో బాలకృష్ణ ని నటించమని కోరగా, బాలకృష్ణ అందుకు అంగీకరించినట్టుగా తెలిసింది.

balakrishnavishwaksen.jpg

అయితే ప్రస్తుతం బాలకృష్ణ వరస సినిమాలతో బిజీ గా వున్నాడు. అవి అయిపోగానే, విశ్వక్ సేన్ కూడా ఈలోపు తాను రాబోయే సినిమాలని పూర్తి చేసి, అప్పుడు మొత్తం 'ఫలక్‌నుమా దాస్ 2' మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారు అని తెలిసింది. కొన్ని రోజుల క్రితం 'దాస్ క ధమ్కీ' సినిమాలో కథానాయకురాలు అయిన నివేదా పెతురాజ్ (Nivetha Pethuraj) తన ఇంటర్వ్యూ లో విశ్వక్ సేన్ బాలకృష్ణ ని కూడా డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పింది. బహుశా ఆమెకి ముందుగా కూడా తెలిసి ఉండొచ్చు, అందుకనే ఆమె ఆలా అనింది అని కూడా అంటున్నారు. ఏమైనా బాలకృష్ణ, విశ్వక్ సేన్ కాంబినేషన్ ఇంకా దబిడి దిబిడే. ఈ సినిమాకి దర్శకుడు కూడా విశ్వక్ సేన్.

Updated Date - 2023-03-24T16:19:38+05:30 IST