Shankar Dada MBBS - Nagababu : రీ రిలీజ్‌ ట్రైలర్‌.. ఆ రోజుల్ని గుర్తు చేసింది!

ABN , First Publish Date - 2023-10-26T21:09:23+05:30 IST

చిరంజీవి (Chiranjeevi), సోనాలి బింద్రే జంటగా నటించిన జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' (Shankar dada mbbs) 2004లో విడుదల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే! తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవంబర్‌ 4న రీ రిలీజ్‌ చేయనున్నారు.

Shankar Dada MBBS - Nagababu : రీ రిలీజ్‌ ట్రైలర్‌.. ఆ రోజుల్ని గుర్తు చేసింది!

చిరంజీవి (Chiranjeevi), సోనాలి బింద్రే జంటగా నటించిన జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' (Shankar dada mbbs) 2004లో విడుదల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే! తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవంబర్‌ 4న రీ రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్‌ ట్రైలర్‌ను గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, శ్రీకాంత పాల్గొన్నారు.

నాగబాబు మాట్లాడుతూ ‘‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ విడుదలై అప్పుడు 20 ఏళ్లు అయిపోయిందా అనిపిస్తోంది. కొన్ని సినిమాలను థియేటర్‌లో చూస్తూ ఆస్వాదించాలి. అలాంటి చిత్రమే ఇది. రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూస్తుంటే అన్నయ్య ఎనర్జీ.. ఓ సాంగ్‌లో శ్రీకాంత్‌ - పవన్‌కల్యాణ్‌ షాట్స్‌, ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వైష్ణవ్‌ తేజ్‌ యాక్టింగ్‌.. ఇలా ఆనాటి రోజులు గుర్తు చేశాయి. అలాగే నా ఆప్తమిత్రుడు ఆహుతి ప్రసాద్‌ ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఈ ట్రైలర్‌లో అతన్ని చూస్తుంటే భావోద్వేగంగా అనిపించింది’’ అని నాగబాబు అన్నారు.

‘‘2004 నాకెంతో ప్రత్యేరం. ఆ సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నటుడిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నయ్య చిరంజీవితో కలిసి నటించాలని ఎన్నో కలలు కనేవాడిని. ‘మున్నాభాయ్‌’ చిత్రాన్ని తెలుగులో అన్నయ్యతో రీమేక్‌ చేస్తున్నారని తెలిసినప్పుడు డైరెక్ట్‌ ఆయనకే ఫోన చేశా. మాతృకలో చూపించినట్లుగా హీరో పక్కన ఉండే కమెడీయన పాత్రకు ఎవరిని ఎంచుకున్నారని అడిగాను. అంతే కాదు ఆ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుంది అన్నయ్యా అని కూడా అడిగేశా. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. కట్‌ చేేస్త.. మరుసటి రోజు జెమిని ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఏటీఎం పాత్ర కోసం నన్ను ఎంచుకున్నట్లు చెప్పారు. ఆ మాట వినగానే ఎంతో సంతోషించా. అన్నయ్యతో కలిసి నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందా. అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సినిమా ఇది. రీ రిలీజ్‌లోనూ ఇది పెద్ద సక్సెస్‌ అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని శ్రీకాంత్‌ చెప్పారు.

Updated Date - 2023-10-26T21:24:37+05:30 IST