కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rangabali first day collection: నాగశౌర్య సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇంతే !

ABN, First Publish Date - 2023-07-08T13:57:07+05:30

నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆమధ్య నానితో 'దసరా' అనే సినిమా నిర్మించి బాగా డబ్బులు చేసుకున్నారు. ఇప్పుడు నాగశౌర్యతో 'రంగబలి' సినిమా నిర్మించారు, నిన్న విడుదల అయింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా వున్నాయి అంటే..

Rangabali first day collection: నాగశౌర్య సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇంతే !
Naga Shaurya from Rangabali
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగశౌర్య (NagaShaurya), యుక్తి తరేజా (YuktiThareja) జంటగా నటించిన సినిమా 'రంగబలి' #Rangabali నిన్న విడుదల అయింది. పవన్ బాసంశెట్టి (PawanBasamsetti) దీనికి దర్శకుడు. ఇందులో కమెడియన్ సత్య (Comedian Satya) ఒక ప్రధాన పాత్ర పోషించాడు. నాగశౌర్య ఈ సినిమా మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. 2019 సంవత్సరంలో విడుదల అయిన 'ఓ! బేబీ' (Oh! Baby) విజయం తరువాత నాగశౌర్య కి అంతగా విజయం సాధించిన సినిమా ఏదీ లేదనే చెప్పాలి. రంగబలి #Rangabali ముందు ఒక అయిదు సినిమాలు చేసినా అందులో ఏవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి.

అందుకని ఇప్పుడు ఈ 'రంగబలి' సినిమా మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం కమెడియన్ సత్య ఒక స్పూఫ్ ఇంటర్వ్యూ కూడా చేసాడు నాగశౌర్యని. అసలు చెప్పాలంటే దానివల్లనే ఈ సినిమాకి కొంచెం అయినా ప్రచారం వచ్చిందని చెప్పాలి. నిన్న శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా మొదటి సగం కొంచెం సరదాగా సాగినా, రెండో సగంలో దర్శకుడు బోల్తా పడ్డాడు. ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి కూడా మంచి స్పందన లభించలేదు.

rangabali1.jpg

అయితే ఈ సినిమా మొదటి ఎంత కలెక్టు చేసిందంటే, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 85 లక్షలు మాత్రమే వసూలు చేసింది అని చెప్తున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 75 లక్షలు మాత్రమే వసూల్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అంటే ఈ నాగశౌర్య సినిమాకి ఓపెనింగ్స్ అంత పెద్దగా రాలేదని మాత్రం చెప్పొచ్చు అని కూడా అంటున్నారు. శనివారం కూడా ఈ సినిమా చూడటానికి ప్రేక్షకుల అంత ఉత్సాహం చూపించటం లేదని కూడా అంటున్నారు. ఇంకా ఏమైనా కలెక్టు చెయ్యాలంటే ఈ శని, ఆదివారాలు మాత్రమే చెయ్యగలదు, లేదంటే చాలా కష్టం. నైజాం ఏరియా లో కేవలం రూ. 26 లక్షలు మాత్రమే కలెక్టు చేసిందని అనలిస్ట్స్ చెపుతున్నారు. సుధాకర్ చెరుకూరి (SudhakarCherukuri) ఈ సినిమాకి నిర్మాత.

Updated Date - 2023-07-08T13:57:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!