Multi-starrer: నాగ శౌర్య, శివరాజ్ కుమార్ మల్టీ-స్టారర్

ABN , First Publish Date - 2023-01-05T13:48:50+05:30 IST

ఇప్పుడు పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే, నాగ శౌర్య ని ఒక మల్టీ-స్టారర్ చిత్రం కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మల్టీ-స్టారర్ లో కన్నడ పరిశ్రమకి చెందిన శివ రాజ కుమార్

Multi-starrer: నాగ శౌర్య, శివరాజ్ కుమార్ మల్టీ-స్టారర్

నాగ శౌర్య మంచి నటుడు కానీ ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' (Phalana Abbayhi Phalana Ammai) షూటింగ్ చేస్తున్నాడు, అలాగే ఇంకో రెండు ప్రాజెక్ట్స్ తో కూడా బిజీ గా వున్నాడు. ఈమధ్యనే తనకు నచ్చిన అమ్మయిని ప్రేమ వివాహం చేసుకొని ఆనందంగా వున్నాడు నాగ శౌర్య. ఇప్పుడు పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే, నాగ శౌర్య ని ఒక మల్టీ-స్టారర్ చిత్రం కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మల్టీ-స్టారర్ లో కన్నడ పరిశ్రమకి చెందిన శివ రాజ కుమార్ (Multi-starrer with Naga Shaurya and Shiva Rajkumar) కూడా ఈ చిత్రం లో నటింపచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

shiva-rajkumar.jpg

శివ రాజకుమార్, కన్నడ పరిశ్రమలో పేరున్న కుటుంబం కన్నడ రాజకుమార్ పెద్ద కుమారుడు. అతని సినిమాలు అప్పుడప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాలుగా విడుదల అవుతున్నాయి. నాగ శౌర్య ఇప్పుడు శివ రాజకుమార్ తో చేతులు కలిపి ఈ మల్టీ-స్టారర్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా గా రూపాంతరం చెందుతుంది. (Pan India cinema) కన్నడ పరిశ్రమలో రాజ్ కుమార్ (Kannada Rajkumar) కుటుంబంకి మంచి పాపులారిటీ వున్న సంగతి తెలిసిందే. అలాగే నాగ శౌర్య తన నటనతో అందరినీ మెప్పిస్తూ, ఇప్పుడిప్పుడే పెద్ద స్థాయికి ఎదుగుతున్న నటుడు. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని (Director Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఇంకా చర్చలు దశలోనే ఉందని, త్వరలో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-01-05T13:48:51+05:30 IST