సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akkineni brothers: అన్న ఏమో అమ్మాయితో వైరల్, మరి తమ్ముడు పరిస్థితి ఏంటి...

ABN, First Publish Date - 2023-04-17T17:21:46+05:30

అన్న నాగ చైతన్య ఎంతో శోభిత ధూళిపాళ తో సాంఘీక మాధ్యమం లో వైరల్ అవుతున్నాడు. మరి తమ్ముడు అఖిల్ అక్కినేని పరిస్థితి ఏంటి అంటే, అఖిల్ చెప్పిన సమాధానం వింటే షాక్ అవుతారు

File photo of Akhil Akkineni with his brother Naga Chaitanya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంతకు ముందు అంటే ఎటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి, నటీనటులు కానీ, సెలబ్రిటీస్ కానీ బయటకి వెళ్ళినప్పుడు అంతగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు వున్న టెక్నాలజీ, సాంఘీక మాధ్యమాలు వున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ మూల, ఎక్కడ ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా తెలిసిపోతోంది. లేకపోతే అక్కినేని చైతన్య (Naga Chaitanya) లండన్ లో డిన్నర్ చేస్తూ ఎవరికో ఒక పోజ్ ఇచ్చినప్పుడు, పక్కనే వున్న నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) కూడా ఆ ఫోటోలో పడింది. అది వాళ్ళు అప్పుడు అనుకోలేదోమో కానీ తరువాత ఆ ఫోటోనే వైరల్ అయింది గా..

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ (Naga Chaitanya) అప్పుడు సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యారు. వాళ్లిద్దరూ కలిసి తిరిగుతున్నారంటూ ఆ ఫోటోలు పెడుతూ వున్నారు. మరి అదే విషయం చైతన్య తమ్ముడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అడిగితే, అతను చెప్పిన సమాధానం వింటే షాక్ అవుతారు మరి. అన్నయ్య, ఒక అమ్మాయితో సాంఘీక మాధ్యమాల్లో (Social media) వైరల్ అవుతున్నాడు కదా, మరి మీ పరిస్థితి ఏంటి అని అడిగినప్ప్పుడు, "ఏముందండీ, రెండు సంవత్సరాల నుండి 'ఏజెంట్' (#Agent) సినిమా చేస్తున్నాను. నా పిలక (ponytail) చూసారుగా, అలాగే నా బాడీ (ఫిజిక్) చూసారుగా. ఈ రెండింటితో నాకు సరిపోయింది, ఇంక వేరే దాని మీద దృష్టి ఎలా ఉంటుంది," అని అఖిల్ చెప్పాడు.

అఖిల్ అక్కినేని సినిమా 'ఏజెంట్' ఈ నెల 28 (AgentOnApril28) న విడుదల అవుతోంది. సురేందర్ రెడ్డి (Surender Reddy) దీనికి దర్శకుడు కాగా, సాక్షి వైద్య (Sakshi Vaidya) కథానాయకురాలుగా చేసింది. డినో మోరీ (Dino Morea) ఇందులో విలనగా నటిస్తుండగా, మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి (Mammootty) ఇందులో రా (RAW) చీఫ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా మీద అఖిల్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఇది అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నాడు. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర కూడా అఖిల్ కి ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ లాంటింది అని చెప్తున్నాడు.

Updated Date - 2023-04-17T17:21:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!