Custody: తమ్ముడికన్నా అన్న కలెక్షన్స్ మరీ దారుణం, అక్కినేని కుటుంబానికి విజయం రాదా?

ABN , First Publish Date - 2023-05-13T10:26:04+05:30 IST

అక్కినేని కుటుంబం, అభిమానులు ఎదురు చూస్తున్న విజయం ఈ సంవత్సరం ఇక లేదనే చెప్పాలి. నాగార్జున (Akkineni Nagarjuna), అఖిల్, సుశాంత్, నాగ చైతన్య ఇలా అందరూ ఆ కుటుంబం నుండి వచ్చిన నటులు పరాజయాన్ని చవిచూస్తున్నారు. 'కస్టడీ' కలెక్షన్స్ కూడా మరీ దారుణంగా వున్నాయి, ఎంత వచ్చింది అంటే...

Custody: తమ్ముడికన్నా అన్న కలెక్షన్స్ మరీ దారుణం, అక్కినేని కుటుంబానికి విజయం రాదా?

అక్కినేని నాగ చైతన్య (Akkineni NagaChaitanya) నటించిన కస్టడీ సినిమా నిన్న శుక్రవారం విడుదల అయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దీనికి దర్శకుడు, ఇది ద్విభాషా చిత్రంగా తీశారు, అలాగే తమిళంలో కూడా విడుదల అయింది. అయితే ఈ సినిమాకి అనుకున్నంతగా ఆదరణ లభించలేదు అని తెలిసిపోతోంది మొదటి రోజు కల్కేషన్స్ చూస్తుంటే. పాపం అక్కినేని (AkkineniFamily) అభిమానులు చాలా ఆశగా ఈ నాగచైతన్య సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు, కానీ వాళ్ళ నమ్మకం వమ్ము అయేట్టు వుంది.

custody2.jpg

మొదటి రోజు నైజాం (Nizam Area) ఏరియా చూస్తే కనక నాగ చైతన్య సినిమా రూ.75 లక్షలు మాత్రమే కలెక్టు చేసింది. గుంటూరు ఏరియా రూ 20 లక్షలు, ఈస్ట్ గోదావరి 11 లక్షలు కలెక్టు చేసింది. నెల్లూరు ఏరియా 10 లక్షలు కలెక్టు చెయ్యగా, మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు కోట్లు మాత్రమే కలెక్టు చేసింది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఇది నాగ చైతన్య సినిమాకి చాలా తక్కువ, డిజాస్టర్ కలెక్షన్ అని చెప్పాలి అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్ హక్కులు సుమారు రూ.21 కోట్ల (Rs 21 crore) వరకు పోయాయని, అంటే ఈ సినిమా అంత కలెక్టు చెయ్యాలని కానీ పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా అది కూడా కలెక్టు చేసే దిశగా లేదని తెలుస్తోంది. తమ్ముడు అఖిల్ అక్కినేని (AkhilAkkineni) కన్నా, అన్న నాగ చైతన్య సినిమా ఇంకా దారుణంగా ఉందని, కలెక్షన్స్ మరీ తక్కువగా ఉన్నాయని చెపుతున్నారు.

Custody-4.jpg

వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా కేవలం రూ 2.5 కోట్లు మాత్రమే కలెక్టు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలామంది తమిళ నటులు అరవింద్ స్వామి (AravindSwamy), శరత్ కుమార్ (SarathKumar), రాంకీ (Ramkee), జీవ (Jiiva) మున్నగువారు వున్నారు. ఇళయరాజా (Ilayaraja) ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. కృతి శెట్టి (KrithiShetty) కథానాయిక.

Updated Date - 2023-05-13T13:21:17+05:30 IST