సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naga Chaitanya: నాగ చైతన్య తో వున్న ఈ అమ్మడిని గుర్తు పట్టారా?

ABN, First Publish Date - 2023-03-28T17:24:53+05:30

ఈసారి ఇంకో ఫోటో వైరల్ అయింది. ఇందులో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరూ ఢిల్లీ లో డిన్నర్ చేస్తుండగా అని అంటున్నారు. మరి వీళ్లిద్దరి బంధం నిజమే అయ్యేట్టు ఉందిగా ఈ ఫోటోస్ చూస్తుంటే....

Naga Chaitanya Akkineni
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత (Samantha) తో విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య (Naga Chaitanya) ఏదో సినిమాల మీద ఫోకస్ పెట్టాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఆమధ్య నాగ చైతన్య, శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) కలిసి తిరుగుతున్నారని ఒక వార్త వైరల్ అయింది. అయితే అప్పట్లో అది నిజమేనా కాదా, ఫేక్ ఫోటో ఏమో అని కూడా చాలామంది అన్నారు. కానీ ఆ తరువాత కూడా ఆ వార్త బాగా వైరల్ అయింది. చాలామంది వాళ్ళిద్దరినీ ఎక్కడెక్కడో చూసాం అని కూడా అన్నారు.

అది ఆలా ఉంచితే, మళ్ళీ నాగ చైతన్య వార్తల్లోకి ఎక్కాడు. అదే వార్తతో. ఈసారి నాగ చైతన్య, శోభిత (Sobhita Dhulipala) ఢిల్లీ లో కలుసుకున్నారు. అయితే వీళ్లిద్దరు అక్కడ డిన్నర్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక హోటల్ స్టాఫ్ నాగ చైతన్యతో పిక్ పెట్టాడు. పాపం నాగ చైతన్య బాడ్ లక్ ఏంటో గానీ ఆ హోటల్ స్టాఫ్ కి పోస్ ఇచ్చినప్పుడు, అక్కడే కూర్చున్న శోభిత ధూళిపాళ కూడా ఆ ఫోటోలో పడింది.

అయితే నాగ చైతన్య కానీ, శోభిత కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఏమో. ఎందుకంటే మామూలుగా సెలబ్రిటీ అనగానే, అందులోకి నటుడు అనగానే ఫోటో కోసం అడుగుతారు. ఆలా అడిగినప్పుడు వెనక ముందు ఎవరున్నారు అని చూడరు గా. చూడకుండానే ఆలా ఇచ్చేసాడు మరి నాగ చైతన్య. ఆలా పోస్ ఇచ్చి ఇప్పుడు వైరల్ అవుతున్నాడు.

నిన్న రాత్రి చరణ్ (Ram Charan Birthday) పుట్టినరోజు పార్టీ కి నాగ చైతన్య తన తండ్రి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), అఖిల్ (Akhil Akkineni) తో పాటుగా అటెండ్ అయ్యాడు. మరి ఢిల్లీ లో ఎప్పుడో శోభిత ని కలిశాడో. మరి నాగార్జున కి ఈ విషయం తెలుసో, తెలియదో. ఇంతకీ చైతన్య కేవలం లంచ్, డిన్నర్ లకు మాత్రమే తీసుకువెళుతున్నాడా, లేదా ఆ బంధాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నదో లేదో చూడాలి. దీని మీద ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Updated Date - 2023-03-28T17:34:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!