Naga chaitanya - AKhil: బాలకృష్ణకు అక్కినేని హీరోల కౌంటర్

ABN , First Publish Date - 2023-01-24T13:58:56+05:30 IST

నందమూరి బాలకృష్ణ వేదికపై మైక్‌ పట్టుకుంటే ఏం మాట్లాడతారో... ఎలా మాట్లాడతారో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఆయన ముక్కుసూటి మాటలు ఎన్నోసార్లు ఇరకాటంలో పెట్టి క్షమాపణ చెప్పే స్థితికి తీసుకొచ్చాయి.

Naga chaitanya - AKhil: బాలకృష్ణకు అక్కినేని హీరోల కౌంటర్

నందమూరి బాలకృష్ణ (balakrishna)వేదికపై మైక్‌ పట్టుకుంటే ఏం మాట్లాడతారో... ఎలా మాట్లాడతారో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఆయన ముక్కుసూటి మాటలు ఎన్నోసార్లు ఇరకాటంలో పెట్టి క్షమాపణ చెప్పే స్థితికి తీసుకొచ్చాయి. తాజాగా బాలకృష్ణ మరోసారి వేదికపై నోరు జారారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో సమానంగా కీర్తి పొందించ అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌.వి.రంగారావు వంటి దిగ్గజ నటులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్‌కు (Trolling on nbk)గురయ్యారు బాలకృష్ణ. (akkineni Family counterr to Balakrishna)

అసలు విషయం ఏంటంటే.. ఆయన హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ (veerasimhareddy success party) సక్సెస్‌ పార్టీ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. సినిమా సాంకేతిక నిపుణులను ప్రశంసిస్తూ.. సెట్‌లో వారితో జరిగిన సంభాషణ గురించి చెబుతూ ‘వీరసింహారెడ్డి టీమ్‌తో కూర్చుని వేద శాస్ర్తాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు.. ఈ రంగారావు(SVR).. అక్కినేని... తొక్కినేని’ (Akkineni thokkineni)అంటూ కబుర్లు చెప్పుకునేవాళ్లం’’ అంటే బాలకృష్ణ మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై అక్కినేని, ఎస్‌.వి.రంగరావు అభిమానులు మండిపడుతున్నారు. సీనియర్‌ ఆర్టిస్ట్‌లను గుర్తు చేసుకుని మాట్లాడుకోవడం మంచిదే కానీ తన తండ్రితో సమానమైన ఆర్టిస్ట్‌ల గురించి గౌరవం లేకుండా అక్కినేని, తొక్కినేని అని అనడం తప్పేనని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలకు అక్కినేని హీరోలు నాగచైతన్య(Naga chaintanya), అఖిల్‌ (Akhil)

సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ లేఖను విడుదల చేశారు. ‘‘నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, ఎస్‌.వి.రంగారావుగారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-01-24T15:03:20+05:30 IST