Nag Vamsi Comments: రిలీజ్‌ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ మీరు చూసుకోండి!

ABN , Publish Date - Dec 31 , 2023 | 07:04 PM

గుంటూరు కారం' చిత్రానికి సంబంధించి ఏ వార్త అయినా ఎంతగా వైరల్‌ అవుతోందో తెలిసిందే! ఏ సినిమా కు అయిన దర్శకుడు, హీరో మాటల్ని బట్టే హైప్‌ క్రియేట్‌ అవుతుంది. అయితే ఈ చిత్రానికి మాత్రం ఇప్పటి దాకా వచ్చిన హైప్‌కి కొంత కారణం పాటలు, టీజర్లు అయితే. మరో బలమైన కారణం నిర్మాత నాగవంశీ మాటలు, ట్వీట్లు.

Nag Vamsi Comments: రిలీజ్‌ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ మీరు చూసుకోండి!

'గుంటూరు కారం' (guntur karam) చిత్రానికి సంబంధించి ఏ వార్త అయినా ఎంతగా వైరల్‌ అవుతోందో తెలిసిందే! ఏ సినిమా కు అయిన దర్శకుడు, హీరో మాటల్ని బట్టే హైప్‌ క్రియేట్‌ అవుతుంది. అయితే ఈ చిత్రానికి మాత్రం ఇప్పటి దాకా వచ్చిన హైప్‌కి కొంత కారణం పాటలు, టీజర్లు అయితే. మరో బలమైన కారణం నిర్మాత నాగవంశీ (Nagavamsi)మాటలు, ట్వీట్లు. కేవలం ఆయన మాటలతోనేప్రమోషన్స్ని వేడెక్కిస్తున్నారు. 'మేము రావట్లేదు అనుకుంటున్నారేమో.. మేం వస్తున్నాం" అని ధీటుగా జవాబిచ్చి సినిమాపై వస్తున్న నెగటివ్‌ ప్రచారానికి అడ్డుకట్ట వేశారు. తాజాగా 'గుంటూరు కారం' థియేటర్స్‌ విషయంలో అభిమానులు ఆందోళన చెందుతుంటే మరోసారి ధీటైన సమాధానం చెప్పారు నాగవంశీ. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Naga-vamsi.jpg

‘‘నేను ఇలా చెబితే బలుపు అనుకుంటారు కానీ ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తాం. అల వైకుంఠపురములో’ అలాగే జరిగింది. నేను విన్న కంటెంట్‌, తీసిన కంటెంట్‌ ఏంటో నాకు తెలుసు కదా! సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నా. మీకు మళ్లీ చెబుతున్నా. మేము అదే మాట మీద ఉన్నాం. ‘గుంటూరు కారం’ను భారీ స్థాయిలో విడుదల చేస్తాం. రిలీజ్‌ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు(maheshbabu) - త్రివిక్రమ్‌ (Trivikram) కలయికలో వస్తున్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రధారులు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృృష్ణ దీనిని నిర్మిస్తున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 07:15 PM