Devil: నా పాత్ర సినిమాలో టర్నింగ్ పాయింట్: ఎస్తర్

ABN , First Publish Date - 2023-12-14T14:03:21+05:30 IST

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియడ్ డ్రామా 'డెవిల్' లో ఎస్తర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను అని అన్నారు. సినిమాకి ఆమె పాత్ర టర్నింగ్ పాయింట్ అని, అది ఒక కీ రోల్ అని చెప్తున్నారు.

Devil: నా పాత్ర సినిమాలో టర్నింగ్ పాయింట్: ఎస్తర్
Ester Noronha

నందమూరి కళ్యాణ్ రామ్ (KalyanRam) కథానాయకుడిగా నటించిన 'డెవిల్' #Devil సినిమా ఈనెల 29న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా (AbhishekNama), ఇందులో సంయుక్త (Samyuktha) కథానాయికగా నటిస్తోంది. మాళవిక మోహన్ (MalavikaMohan) కూడా ఇంకొక ప్రధాన పాత్రలో చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో ఎస్టర్ నోరోన్హా (EsterNoronha) కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఇది ఒక పీరియడ్ డ్రామా, ఇందుల కళ్యాణ్ రామ్ ఒక బ్రిటిష్ గూఢచారిగా నటిస్తున్నారు.

esternewfilm.jpg

"'డెవిల్' సినిమా ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో నేను ఒక కీ రోల్ లో నటిస్తున్నాను," అని చెప్పింది ఎస్తర్. ఈమధ్యనే కన్నడ సినిమా 'ది వేకెంట్ హౌస్' అనే సినిమా ద్వారా దర్శకత్వంలో కూడా తన ప్రతిభని నిరూపించుకున్న ఎస్తర్ ఈ 'డెవిల్' సినిమా గురించి మాట్లాడేరు. "సినిమాలో నా పాత్ర ఒక టర్నింగ్ పాయింట్ లా ఉంటుంది. నాకు బాగా నచ్చిన విషయం ప్రధానంగా ఈ సినిమా కథ, ఎంతో వైవిధ్యంగా ఉండటమే కాకుండా, ఇలాంటి కథ ఈమధ్య కాలంలో ఎక్కడా రాలేదు," అని చెప్పింది ఎస్తర్.

"ఇలాంటి పీరియడ్ డ్రామా సినిమా చెయ్యడం నా కెరీర్ లో ఇదే మొదటి సారి, అదీ కాకుండా ఇందులో నా లుక్ కూడా వైవిధ్యంగా, 1940 సంవత్సరంలో వుండే పరిస్థితులకు అనుగుణంగా చాలా బాగా ఉంటుంది. నా లుక్ చూసి నేనే ఆశ్చర్యపోయాను, అంతలా ఉంటుంది ఈ సినిమాలో నా లుక్," అని చెప్పింది ఎస్తర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని నేను ఎదురు చూస్తున్నాను. అలాగే నా లుక్ గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో కూడా ఈ సినిమా విడుదలయ్యాక ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పారు ఎస్తర్.

estercycle.jpg

ఈ సినిమాలో తనకి పోరాట సన్నివేశాలు లాంటివి ఏమీ లేవని, కానీ తన పాత్ర మాత్రం సినిమాలో ఒక సర్ప్రైజ్ గా ఉంటుంది అని చెప్పింది. కళ్యాణ్ రామ్ తో ఎక్కువ సన్నివేశాలు లేవు అని, ఒకటి రెండు సన్నివేశాల్లో ఇద్దరం కనిపిస్తే కనిపించవచ్చు అని మాత్రం చెప్పారు ఎస్తర్. ఈ 'డెవిల్' సినిమాలోనే కాకుండా, ఎస్తర్ పలు తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో చాలా బిజీగా వున్నారు. దక్షిణాదిలో బిజీగా వున్న నటీమణుల్లో ఎస్తర్ ఒకరు.

Updated Date - 2023-12-14T14:06:04+05:30 IST