OTT: మై నేమ్‌ ఈజ్‌ శృతి స్ట్రీమింగ్  ఎక్కడంటే! 

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:48 PM

హన్సిక ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'మై నేమ్‌ ఈజ్‌ శృతి’ స్కిన్‌ మాఫియా కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ అయింది. ఇప్పుడీ సినిమా ఎలాంటి సమాచారం లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT: మై నేమ్‌ ఈజ్‌ శృతి స్ట్రీమింగ్  ఎక్కడంటే! 

హన్సిక (Hansika)ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (my name is shruthi) స్కిన్‌ మాఫియా కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ అయింది. ఇప్పుడీ సినిమా ఎలాంటి సమాచారం లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (amezon OTT) వేదికగా స్ర్టీమింగ్‌ అవుతోంది. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళీశర్మ,  పూజా రామచంద్రన్‌, ప్రేమ,  రాజీవ్‌ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. 

కథ: శృతి (హన్సిక) యాడ్‌ ఏజెన్సీలో ఉద్యోగి. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో తాతయ్య, అమ్మమ పెంపకంలో పెరిగి పెద్దదవుతుంది చరణ్‌ ( సాయి తేజ)తో ప్రేమలో ఉన్న ఆమె జీవితం అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఎమ్మెల్యే గురుమూర్తి (నరేన్‌) ముఠా వలలో ఇరుక్కుంటుంది. స్కిన్‌ మాఫియా ముఠాలో కీలకమైన గురుమూర్తి చేస్తున్న దారుణాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేమిటి? అసలు ఈ  మాఫియా ముఠా వెనక ఎవరున్నారు? ఎవరెవరు ఇందులో భాగం అయ్యారు?  ఈ ముఠాపై శృతి పోరాటం ఎలా సాగిందనేది ఇతివృత్తం. 


Updated Date - Dec 29 , 2023 | 12:48 PM