Raj-Koti: కాలమే విడదీసింది.. పాటల రూపంలో బతికే ఉంటాడు!

ABN , First Publish Date - 2023-05-22T10:53:05+05:30 IST

తెలుగు సినీ రంగంలో రాజ్‌ - కోటి (Raj koti)సంగీత ద్వయం ఓ సంచలనం. 1980, 90 దశకాల్లో ఈ జంట మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసింది. ఏ సినిమా టైటిల్‌ కార్డ్‌ చేసి ఈ ద్వయం పేరే. వందలాది హిట్‌ సాంగ్స్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఈ ద్వయంలో ఒకరైన రాజ్‌ (Raj is no more) (68) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు.

Raj-Koti: కాలమే విడదీసింది.. పాటల రూపంలో బతికే ఉంటాడు!

తెలుగు సినీ రంగంలో రాజ్‌ - కోటి (Raj koti)సంగీత ద్వయం ఓ సంచలనం. 1980, 90 దశకాల్లో ఈ జంట మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసింది. ఏ సినిమా టైటిల్‌ కార్డ్‌ చేసి ఈ ద్వయం పేరే. వందలాది హిట్‌ సాంగ్స్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఈ ద్వయంలో ఒకరైన రాజ్‌ (Raj is no more) (68) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సంగీత నేపథ్యమున్న కుటుంబంలో పుట్టడం, తనకు కూడా సంగీతం మీద పట్టు ఉండడంతో సంగీత రంగంలో అడుగుపెట్టారు. తన సంగీత ప్రస్థానానికి బలమైన పునాది వేసిన సాలూరి రాజేశ్వరరావు తనయుల్లో ఒకరైన కోటితో అనుబంధం ఏర్పడింది. అది వారిద్దరిని మంచి మిత్రుల్ని చేసింది. ఇద్దరి అభిరుచులు కలవడంతో ‘ప్రళయ గర్జన’ చిత్రంతో సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. ‘సంసారం’ సినిమాతో తొలి విజయాన్ని అందుకోగా, ‘యముడికి మొగుడు’ తర్వాత వెనకడుగు వేసింది లేదు. 90వ దశకంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 180కిపైగా చిత్రాలకు కలిసి పని చేశారు. ‘హలోబ్రదర్‌’ సినిమాకిగానూ ఉత్తమ సంగీత దర్శకులుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ‘పోకిరి రాజా’ సినిమాకి పనిచేస్తున్న సమయంలో వీరిద్దరూ విడిపోయారు. తదుపరి ఇద్దరూ ఎవరికివారు సినిమాలు చేశారు. రాజ్‌ హఠాన్మరణంతో చిత్రసీమ దిగ్ర్భాంతికి లోనైంది. సోమవారం మహా ప్రస్థానంలో ఆయన సోమవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Untitled-2.jpg

కన్నీరుమున్నీరైన కోటి... (koti)

నా రాజ్‌ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ మధ్యనే రాజ్‌ను ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నా. ఆరోగ్య సమస్య ఉన్నట్లుగా నాకు అనిపించలేదు. కానీ, తను గుండెపోటుతో మరణించారని తెలిసి ఎంతో బాధ గా ఉంది. ఇద్దరం కలిసి ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చాం. విడిపోయిన తర్వాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని రాజ్‌ కోటి పాటలుగానే ప్రేక్షకులు ఆదరించారు. తెలుగులో మాది ట్రెండ్‌ సెట్‌ చేసిన జంట మాది. పరిస్థితలు ప్రభావం వల్ల విడిపోయాం. ఈ విషయంలో నాకిప్పటికీ బాధగానే ఉంటుంది. మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటాడు’’ అని కోటి కన్నీరుమున్నీరయ్యారు. ఇంకా రాజ్‌తో ఉన్న జ్ఞాపకాలను కోటి పంచుకున్నారు. ‘‘కాలమే మా ఇద్దరినీ కలిపింది. ఆ కాలం ప్రభావంతోనే మేమిద్దరం విడిపోయాం. ‘మేమిద్దరం మంచి ేస్నహితులం. ఎప్పుడూ సంగీతం గురించే చర్చించుకునేవాళ్లం. రాజ్‌కు మొదటిసారి సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చినప్పుడు.. కలిసి చేద్దామా? అని అడిగాడు. అలా, మేమిద్దరం కలిసి మ్యూజిక్‌ కంపోజింగ్‌ చేయడం మొదలుపెట్టాక సుమారు పదేళ్ల పాటు ఎన్నో సూపర్‌హిట్స్‌ ఇచ్చాం. మంచి పేరు తెచ్చుకున్నాం. అనుకోని కారణాల వల్ల కాలమే మమ్మల్ని విడదీసింది. ఆర్కెస్ర్టాకు సంబంధించిన ట్యూనింగ్‌, ఇతర విషయాలన్నీ రాజ్‌ చూసుకునేవారు. చిత్రబృందాలతో నేను టీమ్‌ అప్‌ అయ్యేవాడిని. ఆ విషయంలో కొంతమంది వ్యక్తులు చెప్పిన మాటలు విని రాజ్‌ నా వద్దకు వచ్చి విడిపోదాం అనిఅన్నాడు. నేను వద్దన్నా. కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించాం. కానీ సాధ్యపడలేదు. తప్పక విడిపోవాల్సి వచ్చింది. అయినా మేం స్నేహితులుగానే ఉన్నాం. మేము విడిపోయిన సమయంలో బాల సుబ్రహ్మణ్యం ఎక్కువగా బాధపడ్డారు. కలిసి వర్క్‌ చేయమని ఎప్పుడూ చెబుతుండేవారు. అలా, ఓసారి మా సంగీత దర్శకులందరూ కలిసి చెన్నైలో ఓ కార్యక్రమం పెట్టారు. అక్కడ మా ఇద్దరినీ కలిపారు. ఇద్దరం కలిసి పని చేయాలనుకున్నాం. కానీ ప్రాజెక్ట్స్‌ రాలేదు’’ అని కోటి చెప్పారు.

Updated Date - 2023-05-22T12:35:42+05:30 IST